Actress Tapsee Pannu denies rumors on Baby

Actress tapsee pannu denies rumors on baby

Tapsee Pannu latest news, Tapsee Pannu movies, Tapsee Pannu gossips, Tapsee Pannu details, Tapsee Pannu updates, Tapsee Pannu love, Tapsee Pannu dating, Tapsee Pannu issue, Tapsee Pannu tweets, Tapsee Pannu stills, Tapsee Pannu

Actress Tapsee Pannu denies rumors on Baby: Actress Tapsee Pannu denies rumors on Baby with Mathias Boe. Tapsee Pannu latest news, gossips, rumors, stills, gallery.

ఈమెకు తెలియకుండానే తాప్సీకి బిడ్డ పుట్టేసాడా?

Posted: 06/08/2015 10:43 AM IST
Actress tapsee pannu denies rumors on baby

టాలీవుడ్ లో సొట్టబుగ్గల సుందరిగా పేరు దక్కించుకున్న తాప్సీకి మగబిడ్డ పుట్టాడట. ప్రస్తుతం ఈ వార్త సినీ ఇండస్ట్రీలో తెగ హల్చల్ చేస్తోంది. టాలీవుడ్, కోలీవుడ్ లలో పలు చిత్రాల్లో నటించి, ఆ తర్వాత బాలీవుడ్ లో అవకాశం రాగానే అక్కడికే మకాం మార్చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ అమ్మడికి అవకాశాలు బాగానే వస్తున్నాయి. అయితే తాజాగా తాప్సీకి కొడుకు పుట్టాడనే వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.

తాప్సీ గతకొద్ది కాలంగా మాథ్యూబో అనే వ్యక్తితో చాలా సన్నిహితంగా వుంటుంది. వీరిద్దరి మధ్య ప్రేమాయణం కొనసాగుతుందని వార్తలొస్తున్నాయి. ఇందులో భాగంగానే తాప్సీ-మాథ్యూబో లకు మగబిడ్డ పుట్టాడని సోషల్ మీడియాలో తెగ వార్తలొస్తున్నాయి. అంతేకాదు తాప్సీ తల్లి అయ్యిందని తెలిసి, మాథ్యూ బో బాడ్మింటన్ పోటీల నుంచి తప్పుకొని తాప్సీ, బిడ్డల కోసం తన సమయాన్ని కేటాయిస్తున్నాడంటూ వార్తలొచ్చాయి. దీంతో ఈవార్తలు విన్న తాప్సీ ఒక్కసారిగా ఖంగుతిందట.

అయితే ఈ వార్తలపై తాప్సీ ఓ క్లారిటీ ఇచ్చేసింది. తనకు తెలియకుండానే తనకు బిడ్డ ఎలా పుడతాడని తాప్సీ ప్రశ్నిస్తుంది. తాను తల్లినయ్యానంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. మాథ్యూబో తాను మంచి స్నేహితులం మాత్రమేనని, అయితే బిడ్డ పుట్టింది మాథ్యూబో స్నేహితుడికి అంటూ తాప్సీ క్లారిటీ ఇచ్చేసింది.

మరి ఇప్పటికైనా ఈ వార్తలు ఆగుతాయో లేదో చూడాలి. తాప్సీ ప్రస్తుతం హిందీలో పలు చిత్రాల్లో నటిస్తుంది. అలాగే తమిళంలో కూడా వచ్చిన సినీ ఆఫర్లను బాగానే చేజెక్కించుకుంటుంది. ఇటీవలే ఈ అమ్మడు ప్రారంభించిన వెడ్డింగ్ ప్లానింగ్ బిజినెస్ బాగానే కొనసాగుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tapsee Pannu  denies rumors  baby  Mathias Boe  

Other Articles