Actress aarti agarwal passes away

Telugu actress aarti agarwal is no more

Arthi Agarwal, no more, liposuction surgery, tollywood news

Famous Telugu heroine Arthi Agarwal well known with the film Nuvvu Naaku Nachav is no more she was found dead

అందాల అభినేత్రి ఆర్తీ అగర్వాల్ హఠాన్మరణం.. టాలీవుడ్ దిగ్ర్బాంతి..

Posted: 06/06/2015 04:43 PM IST
Telugu actress aarti agarwal is no more

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ మంచి గుర్తింపును తెచ్చుకుని.. తెలుగు ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానాన్ని ఏర్పటు చేసుకున్న అందాల అభినేత్రిగా ఖ్యాతిగడించిన నటి ఆర్తీ అగర్వాల్ హఠ్మానరణం చెందారు. అగ్రరాజ్యం అమెరికాలో లైపో సెక్షన్ చికిత్స చేయించుకున్న తరువాత, అది వికటించి అమె అకస్మిక మరణం చెందారు. లైపోసెక్షన్ తో పాటు అర్థీ అగర్వాల్. శ్వాస కోస వ్యాధి తోనే భాధపడుతున్నారని, వాటికి చికిత్స చేయించుకుంటున్న నేపథ్యంలో అది వికటించి మరణించిందని అంటున్నారు. అమె మరణించిన వార్త తెలుగు సినీ ఇండస్ట్రీ విషాధంలో ముంచివేసింది.

2001లో ఆర్తి అగర్వాల్ సినీరంగ ప్రవేశం చేసింది. పాగల్పన్ సినిమాతో బాలీవుడ్లో ప్రవేశించినా.. తర్వాత అదే సంవత్సరంలో వెంకటేశ్ సరసన 'నువ్వు నాకు నచ్చావ్' సినిమాతో తెలుగులో భారీ హిట్తో వచ్చింది. తర్వాత ఇంద్ర, నీ స్నేహం, నువ్వులేక నేను లేను, వసంతం, బాబీ, అడవిరాముడు లాంటి సినిమాల్లో ఆమె నటించారు. మొత్తంగా అమె 20 సినీమాలను తెలుగులో నటించారు. తెలుగునాట అగ్రశేణి హీరోలు.. మెగాస్టార్ చిరంజీవి, యువసామ్రాట్ అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీయార్, ప్రభాస్, నందమూరి నటసింహం బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ హాస్యనటుడు సునీల్, తరుణ్, తదితర నటులతో పలు చిత్రాలలో నటించి.. తన నటనాభినయాన్ని ప్రధర్శించిన అర్తీ అగర్వాల్.. తెలుగు సనీ పరిశ్రమలో అగ్రశ్రేణి హీరోయిన్ గా వెలుగోందిన మళ్లీ సినిమాల్లోకి రావాలన్న ప్రయత్నాలు ఫలించాయి. అయితే పెళ్లైన తరువాత ఒకటి, రెండు చిత్రాలలో నటించిన అమె బి గ్రేడ్ హీరోయిన్ గా ముద్ర పడటంతో.. తిరిగి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది.

అయితే ఎలాగైనా లైమ్ లైట్ లోకి రావాలని తపిస్తున్న ఆర్తీ.. తాజాగా జయమాలిని జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ప్రముఖ రచయిత చల్లా సుబ్రహ్మణ్యం రచించిన క్యాబరే డాన్సర్ అనే నవల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో ఆర్తీ అగర్వాల్ టైటిల్ రోల్ పోషించేందుకు అంగీకరించింది. దీంతో చిత్రంలో సన్నగా, నాజుగ్గా కనిపించేందుకు యత్నించిన అర్తీ అగర్వాల్.. లైపోసక్షన్ చేయించుకునేందుకు అమెరికా న్యూజెర్సీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంది.

అయితే నువ్వు లేక నేను లేను చిత్రం షూటింగ్ సందర్భంగా తన సహచర నటుడు తరుణ్ తో ప్రేమలో పడినా.. అది వన్ సైడ్ లవ్ గానే మిగిలిపోయింది. దీంతో కుటుంబసభ్యుల కోరిక మేరకు ఉజ్వల్ కుమార్ అనే ఎన్నారైని పెళ్లి చేసుకున్నా.. పలు వ్యక్తిగత కారణాలతో అమె అతడికి విడాకులు ఇచ్చింది. అస్పట్లో ఓ సారి అమె ఆత్మహత్యయత్నానికి కూడా పాల్పడిందన్న కథనాలు కూడా వెలువడ్డాయి. దీంతో మళ్లీ సినీరంగ ప్రవేశం చేయాలని భావించిన ఆర్తీ... లైపోసెక్షన్ చేయించుకున్న అమె.. నిన్న సాయంత్రం తీవ్రమైన కడుపునోప్పి రావడంతో మళ్లీ ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంది.

ఈ క్రమంలో న్యూజెర్సీలోని అట్లాంటిక్ సిటీలోని ఓ ప్రైవేలు అస్పత్రిలో అమె మరణించింది. అమెకు సర్జరీ చేసిన వైద్యులు పర్యవేక్షణలో వుండగా, రెండు రోజుల తరువాత ఆర్తీ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. అమె బౌతికఖాయాన్ని అట్లాంటిక్ స్టేట్ ఫ్యూనరల్ హోం లో భద్రపర్చారు. తెలుగు ప్రేక్షకలోకంలో తనకంటూ చెరగని ముద్ర వసుకున్న ఆర్తీ అగర్వాల్ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిద్దాం..!

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arthi Agarwal  no more  liposuction surgery  tollywood news  

Other Articles