Gopichand new film launched

Gopichand new film launched

Gopichand AS Ravikumar choudary film launched, Gopichand film launch, Gopichand movie launch, Gopichand movie news, Gopichand movie updates, Gopichand latest news, Gopichand news, Gopichand stills, Gopichand latest stills, Gopichand

Gopichand new film launched: Gopi has signed his next movie which has been launched officially today in a grand event. The movie will be directed by AS Ravikumar Chowdary.

పిల్లా దర్శకుడితో గోపిచంద్ కొత్త సినిమా

Posted: 06/06/2015 02:48 PM IST
Gopichand new film launched

‘లౌక్యం’, ‘జిల్’ వంటి వరుస హిట్ చిత్రాల తర్వాత టాలీవుడ్ స్టార్ హీరో గోపిచంద్ ప్రస్తుతం బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. నయనతార హీరోయిన్. ఈ సినిమా పూర్తికాకముందే గోపిచంద్ మరో కొత్త చిత్రాన్ని ప్రారంభించేసాడు.

గోపిచంద్ హీరోగా ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలు నేడు హైదరాబాద్ లో జరిగాయి. భవ్య క్రియేషన్స్ బ్యానర్లో ప్రముఖ నిర్మాత వి.ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కోన వెంకట్, గోపి మోహన్ లు స్ర్కీన్ ప్లే ను అందిస్తుండగా, శ్రీధర్ సీపాన డైలాగ్స్ సమకూరుస్తున్నారు.

ఇటీవలే ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమా ఘనవిజయం సాధించడంతో మళ్లీ మరో పవర్ ఫుల్ స్ర్కిప్టుతో గోపిచంద్ ను ఒప్పించినట్లుగా తెలిసింది. ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gopichand  AS Ravikumar choudary  Movie launch  Stills  

Other Articles