Puri Jagannadh | Jyothi Lakshmi | Censor Report

Puri jagannadh jyothi lakshmi censor report

Jyothi Lakshmi Film Censor Report, Jyothi Lakshmi Audio Launch, Jyothi Lakshmi movie news, Jyothi Lakshmi movie updates, Jyothi Lakshmi movie stills, Jyothi Lakshmi movie posters, Jyothi Lakshmi movie trailers, Jyothi Lakshmi movie details, charmme Jyothi Lakshmi, charmme latest stills, charmme hot stills, charmme

Puri Jagannadh Jyothi Lakshmi Censor Report: Actress charmme latest upcoming film jyothi lakshmi. puri jagannadh direction. this film gets U/A censor certificate. audio released. sunil kashyap music.

పూరీ జ్యోతిలక్ష్మీకి సెన్సార్ సర్టిఫికెట్

Posted: 06/05/2015 05:17 PM IST
Puri jagannadh jyothi lakshmi censor report

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జ్యోతిలక్ష్మీ’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సెన్సార్ నుంచి U/A సర్టిఫికెట్ లభించింది. ఛార్మి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో సత్య ఓ కీలక పాత్రలో నటించాడు.

ఈ చిత్రాన్ని ఛార్మికౌర్ సమర్పణలో సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. మరియు శ్రీ శుభశ్వేత ఫిలింస్ బ్యానర్స్ పై శ్వేతలానా, వరుణ్, తేజ, సి.వి.రావు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం నిన్న ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఛార్మి స్టేజ్ పై డాన్స్ చేసి తెగ సందడి చేసింది. అలాగే కార్యక్రమం చివర్లో చిత్ర యూనిట్ అంతా కూడా డాన్స్ చేసి అందరిని అలరించారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్లు, పాటలు దుమ్ములేపుతున్నాయి. ఛార్మీ హాట్ హాట్ అందాల ప్రదర్శన చేయడంతో పాటు పవర్ ఫుల్ లేడీ పాత్రలో కూడా నటించింది. ఇప్పటికే విడుదలైన థియేటర్ ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jyothi Lakshmi  Censor Report  Charmme  Puri jagannadh  

Other Articles