Gabbar Singh 2 | film schedule

Gabbar singh 2 film completes first schedule

Gabbar Singh 2 completes first schedule, Pawan Kalyan Gabbar Singh 2 Movie stills, Pawan Kalyan Gabbar Singh 2 news, Pawan Kalyan Gabbar Singh 2 shooting details, Pawan Kalyan Gabbar Singh 2 movie news, Pawan Kalyan Gabbar Singh 2 movie updates, Pawan Kalyan Gabbar Singh 2 movie started, Pawan Kalyan Gabbar Singh 2

Gabbar Singh 2 film completes first schedule: Powerstar Pawan kalyan latest upcoming film Gabbar singh2. Bobby director, Sharth marar producer, devi sri prasad music.

బాబు గబ్బర్ సింగ్2... ఏంది ఇంత స్పీడు?

Posted: 06/05/2015 11:26 AM IST
Gabbar singh 2 film completes first schedule

‘గోపాల గోపాల’ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ‘పవర్’ ఫేం దర్శకుడు బాబీ దర్శకత్వంలో ‘గబ్బర్ సింగ్2’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గతకొద్ది కాలంగా ఈ ప్రాజెక్టు ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని ఎదురుచూసిన అభిమానులకు ఇటీవలే షూటింగ్ ప్రారంభించి ఆనందపరిచారు ‘గబ్బర్ సింగ్2’ చిత్ర యూనిట్.

నటీనటులు, సాంకేతికనిపుణులు, షూటింగ్ లోకేషన్లు, ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు... ఇలా అన్ని పనులు పూర్తయ్యాకనే ఈ చిత్ర షూటింగ్ మే 29న ప్రారంభించారు. షూటింగ్ ప్రారంభించిన వారం రోజుల్లోనే మొదటి షెడ్యూల్ పూర్తి చేసేసుకుంది. ఈ వార్త వినడానికి సంతోషంగానే వున్నప్పటికీ అభిమానులు మాత్రం చాలా కంగారుపడుతున్నారు.

త్వరత్వరగా షూటింగ్ పూర్తి చేయాలనే వుద్దేశ్యంతో తమ హీరో సినిమాను దర్శకుడు బాబీ ఫ్లాప్ చేస్తాడేమోనని అభిమానులు కాస్త టెన్షన్ పడుతున్నారు. కానీ దర్శకుడు బాబీ మాత్రం పక్కాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ చెబుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి కాబట్టి.. షూటింగ్ నిరవధికంగా కొనసాగుతున్నట్లుగా తెలిసింది.

భారీ అంచనాలతో రూపొందుతున్న  ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత శరత్ మరార్ నిర్మిస్తున్నారు. పవన్ సరసన అనీషా అంబ్రోస్ తొలిసారిగా హీరోయిన్ గా జతకడుతోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Gabbar Singh 2  first schedule  Aneesha Ambrose  

Other Articles