Venkatesh | upcoming films | Movies

Venkatesh talks about his upcoming films

venkatesh latest news, venkatesh movie updates, venkatesh movie details, venkatesh movie stills, venkatesh news, venkatesh latest stills, venkatesh stills, venkatesh

Venkatesh talks about his upcoming films: Tollywood star hero victory venkatesh clarifies on his upcoming films. venkatesh latest news, movies, gossips, updates, details, stills, gallery.

జులై నుంచి వెంకీ డబుల్ విక్టరీ ధమాకా

Posted: 06/04/2015 09:42 AM IST
Venkatesh talks about his upcoming films

‘గోపాల గోపాల’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ తన కొత్త సినిమాను ఇప్పటి వరకూ ఇంకా ప్రారంభించలేదు. దశరథ్ దర్శకత్వంలో వెంకీ ఓ చిత్రం చేయనున్నాడని వార్తలొచ్చాయి కానీ... అవన్నీ ఉత్త పుకార్లేనని తేలిపోయాయి. దీంతో మళ్లీ వెంకీ కొత్త సినిమాపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ విషయంపై వెంకీ తాజాగా ఓ క్లారిటీ ఇచ్చేసాడు.

హైదరాబాద్ లో ఫిల్మ్ ఫేర్ సౌత్ 62వ అవార్డుల వేడుక వివరాలను తెలిపేందుకోసం ఆ సంస్థ తాజాగా ఓ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి వెంకటేష్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వెంకీ తన తరువాతీ సినిమా విశేషాలను తెలియజేస్తూ... జులై నెలలో తాను నటించబోయే రెండు సినిమాల వివరాలను ప్రకటిస్తానని, ప్రస్తుతం ఆ రెండు ప్రాజెక్టులకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చాడు.

జులై నెలలో వెంకటేష్ ఒకటేసారి రెండు సినిమాలను ప్రారంభించబోతున్నాడని అర్థమవుతోంది. మరి ఈ రెండు సినిమాలలో ఏదో ఒకటి ఈ ఏడాది చివర్లో విడుదలవ్వడం ఖాయమని తెలుస్తోంది. మరి ఈ రెండు సినిమాల్లో వెంకీ లుక్స్ పరంగా ఎలా కనిపించనున్నాడో, ఈ సినిమాలు ఎలా వుండబోతున్నాయో అనే విషయం తెలియాలంటే మరికొద్ది కాలం ఎదురుచూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : venkatesh  movie news  62 film fare  

Other Articles