ఇండస్ట్రీలో తారలు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలంటే ‘అందాల ఆరబోతే’ మొదటి మంత్రం! ఏదైనా ఓ సినిమాలో హీరోయిన్లు హోయలొలికిస్తూ అందాలు ఆరబోసేస్తే చాలు.. రాత్రికిరాత్రే టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిపోతారు. అలాగే మరో రెండుమూడు సినిమాల్లో కంటిన్యూ చేస్తే.. ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే పెరిగిపోవడంతోపాటు మూవీ ఆఫర్లు కూడా పెరిగే అవకాశాలు వుంటాయి. ఈ విధంగా ఈ ‘ఆరబోత’ మంత్రాన్ని నమ్ముకుని సక్సెస్ అయిన భామలు చాలామందే వున్నారు. ఈ తరహాలోనే తనకంటూ ప్రత్యేక ముద్ర సాధించడం కోసం సోనాల్ చౌహాన్ కూడా అందాలు ఆరబోస్తూ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
‘లెజెండ్’ సినిమాలో బాలయ్య సరసన నటించిన సోనాల్ చౌహాన్.. ఆ మూవీలోనే బికినీ వేసి తళుక్కుమంది. అప్పుడు ఈ అమ్మడు కొన్నాళ్లు టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిపోయింది. ఆ మూవీ పుణ్యమా అని ఈమెకి రామ్ సరసన ‘పండగచేస్కో’ సినిమాలో నటించే ఆఫర్ వరించింది. ఈ విధంగా వచ్చిన ఈ ఆఫర్ ని క్యాచ్ చేసుకుని తన ఇమేజ్ ని మరింత పాపులర్ చేసుకోవాలని సోనాల్ భావించిందేమో! అందుకే.. ఈ చిత్రంలో బాగానే తన ఆరబోసేసింది. ఈ చిత్రంలో పొగరుబోతు యువతిగా సోనాల్ నటించి మెప్పించడమే కాకుండా బికినీ వేసి బాగానే తన అందాలు చూపించింది. సోనాల్ అందాలను ఆరబోస్తున్న విధానం చూస్తుంటే.. ‘నాకు అవకాశాలు ఇస్తే నేను పండగ చేసుకోవడమేకాకుండా.. అందాలను ఆరబోస్తూ మీరు పండగ చేసుకునేలా చేస్తాను’ అని పరోక్షంగా చెబుతున్నట్లుగా అనిపిస్తోందని సినీ విశ్లేషకులు అంటున్నారు.
ఏదైతేనేం.. ప్రేక్షకులు థియేటర్లలో ఈమె అందాలు చూస్తూ ‘పండగ చేసుకుంటున్నార’ని అంతా చెప్పుకుంటున్నారు. మరి.. ఇంతలా తన అందాలు ఆరబోస్తూ రెచ్చిపోతున్న ఈ అమ్మడికి.. రానున్న కాలంలో మరిన్ని అవకాశాలు వరిస్తాయో లేదో వేచి చూడాల్సిందే!
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more