Finally Preity Zinta Accepts that She is in dating with someone nice in us | Bollywood Love Affairs

Preity zinta accepts she is in dating with someone nice in us

Preity Zinta news, Preity Zinta love affairs, Preity Zinta dating, Preity Zinta us tour, Preity Zinta kings punjab team, Preity Zinta ipl controversy, Preity Zinta wadia controversy

Preity Zinta Accepts She is in dating with someone nice in us : Bollywood actress Preity Zinta finally Accepts that She is in dating with someone nice in us. But she didn't explain anything about that guy.

డేటింగ్ చేస్తున్నట్లు నిజం ఒప్పుకుంది కానీ..

Posted: 05/30/2015 11:55 AM IST
Preity zinta accepts she is in dating with someone nice in us

ఐపీఎల్ లో చోటు చేసుకున్న ఓ వివాదం నటి ప్రీతిజింటా, ఆమె భర్త నెస్ వాడియా ఇద్దరూ శాశ్వతంగా విడిపోవడానికి కారణంగా నిలిచింది. ఓ మ్యాచ్ సందర్భంగా తనను కొట్టాడని ప్రీతి తన భర్త వాడియాపై గతేడాది ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే! ఆఖరికి ప్రీతీ పోలీస్ కేసు పెట్టేంత వరకూ ఈ వ్యవహారం వెళ్లింది. కొన్నాళ్లవరకు వీరి గొడవ వ్యవహారం సంచలనం సృష్టించింది. అయితే.. కొన్నాళ్ల తర్వాత ప్రీతి అమెరికా వెళ్లిపోయింది. ఏడాది తర్వాత ఐపీఎల్ కోసం మళ్లీ భారత్‌కు వచ్చింది. అయితే.. యూఎస్ లో వున్నప్పుడు ప్రీతి ఓ వ్యాపారవేత్తతో ప్రేమాయణం నడుపుతున్నట్లు ప్రచారంలో వుంది. ఆ ప్రేమ వార్తలపై తాజాగా ప్రీతిని ప్రశ్నించగా.. ఆమె డేటింగ్ చేస్తున్నట్లు నిజం ఒప్పేసుకుంది.

యూఎస్‌లో ఉన్నప్పుడు తాను ఓ వ్యాపారవేత్తతో ప్రేమలో పడ్డానని వచ్చిన వార్తలు నిజమేనని ప్రీతి స్పష్టం చేసింది. ‘అవును. నేను యూఎస్ లో వున్న ఓ వ్యాపారవేత్తతో డేటింగ్ చేస్తున్నా. అయితే.. ఆ వ్యక్తి ఎవరు? అతని హైట్ ఎంత? వెయిట్ ఎంత? ఎలా వుంటాడు..? ఏ రంగు? ఏం చేస్తాడు? లాంటి ప్రశ్నలు మాత్రం అడగొద్దు. అతని గురించి అస్సలు చెప్పకూడదని అనుకుంటున్నాను. డేటింగ్ చేస్తున్నానని ఒప్పుకున్నా కదా.. ఇక అంతటితో చర్చలకు ఫుల్‌స్టాప్ పెట్టేయండి. సమయం వచ్చినప్పుడు నేనే నా బాయ్ ఫ్రెండ్ గురించి అన్ని వివరాలు వెల్లడిస్తా. ఇకనుంచి నా ప్రేమ వ్యవహారం గురించి నన్ను ప్రశ్నించడం మానేయండి’ అంటూ ప్రీతి జింటా వెల్లడించింది. దీంతో ఆ వ్యక్తి ఎవరబ్బా..? అని తెలుసుకోవడంలో మీడియాజనాలతోపాటు ఇండస్ట్రీ ప్రముఖులు ఆలోచనల్లో పడిపోయినట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Preity Zinta  bollywood affairs  ipl controversies  

Other Articles