Dhanush | Maari | First Look | Teaser

Dhanush maari official teaser released

Dhanush Maari Official Teaser, Maari Official Teaser, Dhanush Maari Teaser, Dhanush Maari First Look, Dhanush Maari posters, Dhanush Maari stills, Dhanush Maari movie news, Dhanush Maari movie updates, Dhanush Maari

Dhanush Maari Official Teaser Released: Maari Official First Look Teaser Released. Starring – Dhanush, Kajal Agarwal and others, Written & Directed by Balaji Mohan, An Anirudh Musical, Produced By R. Sarathkumar R. Radikaa Sarathkumar Listin Stephen.

యూట్యూబ్ రికార్డుల మోతలో ‘మారి’ ట్రైలర్

Posted: 05/21/2015 10:41 AM IST
Dhanush maari official teaser released

తమిళ స్టార్ హీరో ధనుష్ ‘మారి’ కోలీవుడ్ లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. వరుస హిట్ చిత్రాలతో దూసుకుపోతున్న ధనుష్ కు కేవలం తమిళంలోనే కాకుండా టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా భారీ మార్కెట్ ఏర్పడింది. ధనుష్ సినిమాలు తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తున్నాయి. అలాగే హిందీలో ధనుష్ నటించిన సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

ప్రస్తుతం ధనుష్ హీరోగా తమిళంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మారి’. బాలాజీ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆర్.శరత్ కుమార్, ఆర్.రాధిక శరత్ కుమార్, లిస్టిన్ స్టీఫెన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.

తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసారు. ఇందులో ధనుష్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. ఈ ట్రైలర్ విడుదలైన కేవలం 15 గంటల్లోనే 232,463 మంది వీక్షించారు. కానీ ఇందులో ధనుష్ ను చూస్తుంటే ఇటీవలే హిందీలో ధనుష్ నటించిన ‘షమితాబ్’లోని లుక్ వలే అనిపిస్తుంది.

షమితాబ్ లుక్ కు కాస్త మాస్ స్టైల్ ను జతచేస్తే.. ‘మారి’ అన్నట్లుగా అనిపిస్తుంది. ఓసారి మీరు ఓ లుక్కేయండి. ‘మారి’లో ధనుష్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dhanush  Maari  First Look  Teaser  

Other Articles