Kamal Haasan | Thoongaavanam | Movie news

Kamal haasan next movie title thoongaavanam

Kamal Haasan latest movie Thoongaavanam, Kamal Haasan Thoongaavanam, Kamal Haasan latest news, Kamal Haasan movie news, Kamal Haasan movie updates, Kamal Haasan telugu movie, Kamal Haasan telugu news, Kamal Haasan

Kamal Haasan next movie title Thoongaavanam: Tamil Actor Kamal Haasan announced the title of his upcoming Tamil-Telugu bilingual film is Thoongaavanam and it will go on floors in Hyderabad on May 24.

తెలుగు, తమిళంలో కమల్ థ్రిల్లర్ చిత్రం

Posted: 05/18/2015 11:52 AM IST
Kamal haasan next movie title thoongaavanam

లోకనాయకుడిగా పేరు దక్కించుకున్న తమిళ అగ్ర కథానాయకుడు, స్టార్ హీరో కమల్ హాసన్ త్వరలోనే ఓ యాక్షన్, థ్రిల్లర్ మూవీతో మనముందుకు రానున్నాడు. గతకొద్ది కాలంగా విభిన్న చిత్రాలతో కేవలం తమిళంలోనే సినిమాలు చేస్తూ బిజీగా వున్న కమల్ హాసన్... తొలిసారిగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఓ చిత్రంలో నటించనున్నాడు.

కమల్ హీరోగా తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో ఓ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి కమల్ దగ్గర అసోసియేట్ గా పనిచేసిన రాజేష్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఈనెల 24న హైదరాబాదులో ప్రారంభం కానుందని కమల్ స్వయంగా తెలియజేసారు.

యాక్షన్, థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ చిత్ర షూటింగ్ ను నలభై రోజుల పాటు హైదరాబాద్ లోనూ, మరో నలభై రోజుల పాటు చెన్నైలో జరుపనున్నారు. ఈ చిత్రానికి తమిళంలో ‘తూంగావనం’ అనే టైటిల్ ఖరారు చేసారు. గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే తెలుగు వర్షెన్ కు సంబంధించిన అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kamal Haasan  Thoongaavanam  Movie news  

Other Articles