Bollywood actress Sunny Leone | obscenity | Thane | Dombivali police | crime branch

Bollywood actress sunny leone charged with obscenity

Bollywood actress Sunny Leone, Dombivali police, distribution of obscene content, web and social networking sites, Thane, mumbai crime branch, case registered sunny leone, housewife Anjali Palan, obscene posts and pictures sunny leone, objectionable material on site, sunneyleone.com, Bollywood actress, Sunny Leone, Bollywood obscenity, Dombivali police, Thane police, distribution of obscene content, obscenity web, obscenity social networking sites

Bollywood actress Sunny Leone has been booked by Dombivali police for alleged distribution of obscene content on web and social networking sites.

బాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్ కు అంజలీ ఇబ్బందులు

Posted: 05/15/2015 05:36 PM IST
Bollywood actress sunny leone charged with obscenity

పోర్న స్టార్ గా ప్రపంచాన్ని ఒ ఊపు ఊపిన సన్నీ లియోన్.. బాలీవుడ్ లోకి ప్రవేశించి తన సత్తా ఏంటన్నది రుజువు చేసుకుంది. అటు సామాజిక మాద్యమాలతో పాటు ఇటు వైబ్ సైట్లలోనూ.. అత్యంత అధికంగా వినబడుతుంది సన్నీ పేరేనట. ఈ మద్య ఈ తార ట్విట్టర్లో ప్రధాని మోడీని కూడా వెనక్కు నెట్టిసి ముందుకు దూసుకుపోయింది. అంతేకాదండీ.. ఒక జాతీయ మీడియా నిర్వహించిన సర్వేలో ఈ శృంగార బామ దీపికా, కత్రినా, ప్రియాంక, కరినా, కంగనా లాంటి బాలీవుడ్ బామలందరినీ తోసిరాజి మోస్ట్ డిసైరబుల్ వుమెన్ కాంటెస్టులో అగ్రస్థానాన్ని కూడా అక్రమించింది. అయితే ఇలా ముందుకు దూసుకెళ్తున్న ఈ బామకు ఇప్పడు ఇబ్బందుల్లో పడనుంది.

ఇంతలా ఎదిగిపోతున్న తరుణంలో సన్నీకి అంజలి భయం పట్టుకుంది. ఎందుకంటే..? అమెకు ఇబ్బందులను తెచ్చిపెట్టింది అంజలీ కాబట్టి. ఇంతకీ ఎవరీ అంజలి..? ఏమా కథ.. నన్నీని మించిన నటీమణా..? లేక మరెవరు..? ఈ ప్రశ్నలు మీ మదిని తొలచివేస్తున్నాయి కదూ..! వెబ్సైట్లలోను, సోషల్ మీడియాలోను అత్యంత అసభ్యతను ప్రచారం చేస్తోందంటూ సన్నీ లియోన్పై మహారాష్ట్రలోని థానె నగరంలో కేసు నమోదు చేసింది అంజలీ పాలన్. ఈమె ఒక గృహిణి. ధానేలోని డోంబివిలి పోలీసులు అంజలీ పాలన్ ఇచ్చిన పిర్యాదు మేరకు సన్నీ లియోన్ పై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 292, 292 ఎ, 294 రెడ్ విత్ 34 సెక్షన్లతో పాటు ఐటీ చట్టం, భారతీయ మహిళా ప్రాతనిధ్య చట్టంలోని సెక్షన్లు 3, 4 కింద కేసులు నమోదు చేశారు. గత రాత్రి పిర్యాదును అందుకున్న పోలీసులు సన్నీ లియోన్ పై కేసు నమోదు చేశారు.

ఇంటర్నెట్ చూస్తుంటే సన్నీ లియోన్కు చెందిన పలు అసభ్య చిత్రాలు, పోస్టులు కనిపించాయని అంజలీ పాలన్ తెలిపారు. అలాగే ఆమె వెబ్సైట్ సన్నీలియోన్.కామ్ లో కూడా విపరీతమైన అసభ్య సమాచారం ఉందన్నారు. ఇలాంటి పోస్టుల వల్ల పిల్లల మెదళ్లు విషపూరితం అవుతాయని ఆమె తన ఫిర్యాదులో ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వైబ్ సైట్ లను సంప్రదాయ దేశమైన భారత్ లోకి అనుమతించకుండా నిరోధించాలని అమె కోరారు. సంస్కృతీ సంప్రదాయాలతో మేళవితమైన దేశంలో అసభ్యతను పెంచి పోషించడం ఫ్యాషన్ గా మారిపోయిందని అంజలీ పాలన్ అవేదన వ్యక్తం చేశారు. డోంబివిలి పోలీసులు ఈ కేసును థానె సైబర్ క్రైం విభాగానికి బదిలీ చేశారు. రెండు వారాల క్రితం తన సినిమా 'ఏక్ పహేలి లీలా' సినిమా ప్రమోషన్ కోసం సన్నీలియోన్ థానె వెళ్లిన నేపథ్యంలో అమె గురించి తెలుసుకున్న అంజలీ పాలన్ పోలీసులకు పిర్యాదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sunny leone  obscenity  anjali palan  Dombivali police  

Other Articles