Baahubali | Kalakeya | Poster | Prabhas

Bahubali kalakeya first look poster released

Kalakeya First Look Poster Released, Baahubali new posters, Baahubali new look, Baahubali movie news, Baahubali movie updates, Baahubali movie news, Baahubali movie stills, Baahubali movie latest stills, Baahubali movie latest updates, Baahubali, Prabhas, Ramya krishna

Bahubali Kalakeya First Look Poster Released: Director SS Rajamouli latest movie Bahubali. Prabhas, anushka, rana, tamanna acts in lead roles. Keeravani music.

వామ్మో.. ఈయనెంది సామి ఇట్టా వున్నాడు?

Posted: 05/11/2015 04:54 PM IST
Bahubali kalakeya first look poster released

‘బాహుబలి’ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు ఈనెల 1 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సినిమాలో నటించిన నటీనటుల పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేస్తూ, వినూత్నంగా ప్రమోషన్ చేస్తున్నారు. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.

ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి భారీ క్రేజ్ ఏర్పడింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు భారీ రెస్పాన్స్ వస్తుంది. తాజాగా ఈ చిత్రంలోని ‘కాలకేయ’ పాత్రకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసారు. ఈ పోస్టర్ ను చూస్తుంటే ఇదేదో మహాసంగ్రామం సమయంలో చిత్రీకరించినట్లుగా అనిపిస్తుంది.

భారీ యుద్ధ సన్నీవేశాలున్న ఈ సినిమాలో ఈ కాలకేయ పాత్ర ఎలా వుండనుందోనని అందరిలో ఓ చిన్న ఆతృత మొదలయ్యింది. రాజమౌళి సినిమాలో చిన్న వేశం వేసిన కూడా వాళ్లకు భారీ క్రేజ్ లభిస్తుంది. అలాంటిది ఇలాంటి గెటప్ లో నటిస్తే.. ఇక వారికి భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు వస్తాయో మీరే ఊహించుకోండి.

భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్ర థియేటర్ ట్రైలర్ ను మే 31వ తేదిన విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని జులై 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా విడుదలైన కాలకేయ ఫస్ట్ లుక్ పోస్టర్ మీకోసం అందిస్తున్నాం.. మీరు ఓ లుక్కేయండి.

Bahubali-Kalakeya

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Baahubali  Kalakeya  Poster  Prabhas  

Other Articles