చెడు చేసే వాడు ఆలోచించాలి. మంచి చేసే వాడు చేసుకుంటూ పోవాలనేది క్రిష్ నమ్మిన సిద్ధాంతం. దేవుడి అండతో చిన్న చిన్న మోసాలు చేస్తూ జీవితాన్ని గడుపుతుంటాడు. ఎలాంటి గోల్ లేని అతడి జీవితంలోకి అనుకోకుండా ఓ పెద్ద లక్ష్యం వచ్చి చేరుతుంది. అదేమిటి? 12 శతాబ్దానికి చెందిన సీతారాముల విగ్రహాలతో అతనికి ఉన్న సంబంధమేమిటి? అనే విషయాలు తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’ అని అంటున్నారు సుధీర్‌బాబు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’. లక్ష్మీనరసింహా ఎంటర్టైన్మెంట్ పతాకంపై చక్రి చిగురుపాటి నిర్మిస్తున్నారు. ‘స్వామిరారా’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి బోస్ నెల్లూరి దర్శకుడు. నందిని కథానాయిక. నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి.
ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాల్ని తెలియజేస్తూ ‘12 శతాబ్దానికి చెందిన విక్రమాదిత్య మహారాజు తయారుచేయించిన అతి విలువైన సీతారాముల విగ్రహాల్ని దొంగిలించేందుకు కొందరు ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో వారికి ఎదురైన పరిస్థితులు ఏమిటి? వారి ప్రయత్నాలు ఎంతవరకు సఫలమయ్యాయి? అన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో వినోదానికి ప్రాధాన్యముంటుంది. సుధీర్‌బాబు పాత్ర చిత్రణ కొత్త పంథాలో సాగుతుంది. మణికాంత్ ఖాద్రి స్వరాలకు చక్కటి స్పందన లభిస్తుంది. ఈనెల 21న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని అన్నారు.
సప్తగిరి, అభిమన్యుసింగ్, జయప్రకాష్‌రెడ్డి, దువ్వాసి మోహణ్, ప్రవీణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణికాంత్ ఖాద్రి, ఆర్ట్: నాగేంద్ర, మాటలు: ప్రసాద్‌వర్మ పెన్మత్స, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, పాటలు: శ్రీమణి, కె.కె, సినిమాటోగ్రఫీ: సాయిప్రకాష్, అసోసియేట్ ప్రొడ్యూసర్: సతీష్ వేగేశ్న.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more