Trisha | Rana | Birthday | tweets

Actress trisha hot comments on rana

Actress Trisha hot comments on rana, Rana Wishes to Trisha on her birthday, Rana Wishes to Trisha, Trisha tweets, Trisha latest tweets, Trisha latest news, Trisha latest updates, Trisha latest stills, Trisha birthday news, Trisha

Actress Trisha hot comments on rana: Today star actress trisha birthday. Wishes to her. Rana wishes to trisha.

రానాను సైకో అంటున్న బర్త్ డే బేబీ

Posted: 05/04/2015 01:31 PM IST
Actress trisha hot comments on rana

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ త్రిష... తన కెరీర్ ప్రారంభం నుంచే స్టార్ హీరోయిన్ స్టేటస్, క్రేజ్ ను సొంతం చేసుకున్న తక్కువ మంది హీరోయిన్లలో త్రిష కూడా ఒకరు. ఈ అమ్మడు ఇప్పటికే కూడా అదే అందం, స్మైల్, యాక్టింగ్ తో వరుస హిట్ చిత్రాలతో దూసుకుపోతుంది. నేడు(మార్చి 4) త్రిష పుట్టినరోజు. ఈ సంధర్భంగా త్రిషకు ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ...

త్రిష పుట్టినరోజు సంధర్భంగా రెండు హాట్ న్యూస్ లు కోలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. అవేమిటంటే... త్రిష మొన్నటి వరకు నటుడు రానాతో కలిసి బాగా క్లోజ్ గా వుండేదనే విషయం అందరికి తెలిసిందే. వీరిద్దరూ ప్రేమలో వున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలొచ్చాయి. కానీ వీరిద్దరూ విడిపోయారు. పెళ్లి వార్తలు ఆగిపోయాయి.

ఆ తర్వాత అందరికి షాకిచ్చేలా త్రిష.. వరుణ్ మాణియన్ అనే వ్యాపారవేత్తను నిశ్చితార్థం చేసుకుంది. త్వరలోనే త్రిష తన పెళ్లి వార్త చేబుతుందనుకుంటే... అసలు పెళ్లి ఊసే పట్టించుకోకుండా వరుసగా చిత్రాలను అంగీకరించేస్తోంది. అయితే తాజాగా మళ్లీ త్రిష, రానాల హాట్ న్యూస్ బయటకొచ్చింది.

Rana Wishes to Trisha on her birthday-02

త్రిష పుట్టినరోజు సంధర్భంగా నిన్న రాత్రే తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసాడు రానా. ఈ సంవత్సరమంతా త్రిష అద్భుతంగా వుండాలని కూడా కోరుకుంటూ రానా తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసాడు. ఈ విషయంపై త్రిష స్పందిస్తూ... ‘థ్యాంక్యూ సైకో’ అంటూ సమాధానమిచ్చింది.

అయితే ఈ విషయంపై కోలీవుడ్ లో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో త్రిషతో రానా సైకో వలే ప్రవర్తించడం వల్లే వీరిద్దరూ దూరమయ్యారని, అందుకే మళ్లీ ఇపుడు అలా సైకో అంటూ త్రిష ట్వీట్ చేసిందని కొందరంటుంటే... మరికొందరేమో.. వీరిద్దరి స్నేహం ఎంత బలమైనదో తెలుస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

వీరి విషయం కాసేపు పక్కన పెడితే... త్రిష నిశ్చితార్థం చేసుకున్న వరుణ్ మణియన్ ఇంకా పుట్టినరోజు విషేస్ చెప్పాలేడట. దీంతో వీరి పెళ్లి ఆగిపోయిందంటూ వస్తున్న వార్తలకు బలాన్నిస్తున్నాయి. గతకొద్ది రోజులుగా త్రిష, వరుణ్ లు మాట్లాడుకోవటం లేదని, పైగా త్రిష తన నిశ్చితార్థపు ఉంగారాన్ని తీసేసిందని, అందుకే పెళ్లి క్యాన్సిల్ అయ్యింది కావచ్చంటూ కోలీవుడ్ వార్తలొస్తున్నాయి. మరి ఈ విషయంపై త్రిష ఎలా స్పందిస్తుందో ఏమో!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Trisha  Rana  Birthday  tweets  

Other Articles