Sundeep kishan Tiger Movie Release on May Second Week | Tiger Movie

Sundeep kishan tiger movie release on may second week

Sundeep kishan Tiger Movie Release in May, Tiger Movie news, Tiger Movie release date, Sundeep kishan latest news, Sundeep kishan movie news, Sundeep kishan movie updates, Sundeep kishan stills, Sundeep kishan, Tiger Movie stills, Tiger Movie details, Tiger Movie trailer, Tiger Movie teaser, Tiger Movie posters, Sundeep kishan Tiger Movie

Sundeep kishan Tiger Movie Release on May Second Week: Sundeep kishan latest movie Tiger. seerath kapoor heroine. Rahul ravindra special role. Thaman music. movie release on may second week.

మే నెలలో విడుదలకు సిద్ధమవుతున్న టైగర్

Posted: 04/30/2015 05:27 PM IST
Sundeep kishan tiger movie release on may second week

సందీప్ కిషన్ హీరోగా రాహుల్ రవీంద్రన్, సీరత్ కపూర్ ప్రధాన పాత్రలలో రూపొందిన చిత్రం ‘టైగర్’. 'ఠాగూర్' మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా పతాకంపై ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. నిర్మాణానంతర కార్యక్రమాల తుది దశకు చేరుకున్నాయి. వారణాసి నేపథ్యంలో సాగే విభిన్నమైన కథాంశంతో దర్శకుడు వి.ఐ. ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. థమన్ సంగీతం అందించిన పాటలు ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. ఈ పాటలకు మంచి స్పందన లభిస్తోందని నిర్మాతలు తెలిపారు. మే నెల రెండో వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.

ఈ సందర్భంగా ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ - ''ప్రేమ, స్నేహం, యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలున్న మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ ఇది. సందీప్ కిషన్ ది ఫుల్ మాస్ మరియు ఎనర్జిటిక్ కారెక్టర్. తమన్ స్వరపరచిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది'' అని చెప్పారు.

'ఠాగూర్' మధు మాట్లాడుతూ - ''ఇది పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్ టైనర్. అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించాం. హీరోగా సందీప్ కిషన్ కెరీర్ ని మరో స్థాయికి తీసుకెళ్లే చిత్రం అవుతుంది. అన్నివర్గాల వారూ చూడదగ్గ విధంగా చిత్రం ఉంటుంది. అత్యధిక థియేటర్లలో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం'' అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sundeep Kishan  Tiger Movie  release date  Trailers  

Other Articles