Nara Rohit in Telugu remake of Maan Karate | Telugu Film Industry

Nara rohit another tamil remake mann karate

Nara Rohit news, Nara Rohit updates, Nara Rohit gossips, Nara Rohit asura, Nara Rohit mann karate, mann karate news, Nara Rohit shankara, Nara Rohit pandagala vachadu, telugu remake movies

Nara Rohit Another Tamil Remake Mann Karate : Telugu Young Hero Nara Rohit Doing Another Remake Mann Karate Tamil Movie Which Is Huge Hit In Tamilnadu.

‘రీమేక్’ల పరంపరం.. తమిళ చిత్రంపై రోహిత్ మోజు!

Posted: 04/25/2015 11:28 AM IST
Nara rohit another tamil remake mann karate

ఇతర భాషాచిత్రాలు మంచి విజయాలు సాధిస్తే చాలు.. కొందరు తెలుగు హీరోలు వాటిని క్యాష్ చేసుకుని తమ ఇమేజ్ పెంచుకోవడం కోసం రీమేక్ లు చేస్తుంటారు. ఎప్పటినుంచో కొనసాగుతూ వస్తున్న ఈ పరంపరను నేటి స్టార్ హీరోలతోపాటు యువహీరోలు సైతం ఫాలో అవుతున్నారు. ఈ జాబితాలో నారా రోహిత్ ఎప్పుడో చేరిపోయాడు. ఇప్పుడు తాజాగా ఈ హీరో మరో తమిళ సినిమాపై మోజు పడి.. దానిని తెలుగులో రీమేక్ చేసే పనిలో పడ్డాడు.

మొదటినుంచి విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ తనదైన శైలిలో దూసుకుపోతున్న నారా రోహిత్.. ఆమధ్య తమిళంలో ఘనవిజయం సాధించిన ‘మాన్ కరాటే’ చిత్రాన్ని వీక్షించాడు. ఈ సినిమా తన శైలికి తగినట్లుగా వుందని, సరికొత్త కథాంశంతోపాటు వెరైటీ ఎలిమెంట్లు ఇందులో వున్న నేపథ్యంలో ఈ మూవీని తెలుగులో రీమేక్ చేయడానికి రోహిత్ డిసైడ్ అయ్యాడు. ఈ మేరకు తన కోరికను వెల్లడించిన నేపథ్యంలో.. అప్పుడు ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను మొదలుపెట్టినట్లు సమాచారం!

ఈ రీమేక్ సినిమాను ఇటీవలే ‘జోరు’ చిత్రాన్ని రూపొందించిన కుమార్ నాగేంద్ర దర్శకత్వం వహించనున్నాడు. ‘జిల్’ సినిమాలో స్టైలిష్ విలన్ గా ప్రేక్షకులకు కనువిందు చేసిన మోడల్ కబీర్ దుహన్ సింగ్.. ఈ సినిమాలోనూ విలన్ గా నటించనున్నాడు. ఈ మూవీకి సంబంధించిన అధికారిక వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. మరోవైపు.. నారా రోహిత్ నటించిన ‘శంకర’ (మౌనగురు రీమేక్) సినిమా విడుదలకు సిద్ధంగా వుంది. అలాగే ఇతని మరో రెండు సినిమాలు ‘పండగలా వచ్చాడు’, ‘అసుర’ నిర్మాణ దశలో వున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nara Rohit  Mann Karate Remake  Telugu Film Industry  

Other Articles