tamannah rashi khanna romantic scenes with raviteja in bengal tiger

Tamannah rashi khanna romance raviteja bengal tiger movie shooting ramoji film city

tamannah bhatia, tamannah hot photos, tamannah romantic scenes, tamannah hot gossips, rashi khanna news, rashi khanna gallery, rashi khanna updates, raviteja news, bengal tiger news, bengal tiger movie updates

tamannah rashi khanna romance raviteja bengal tiger movie shooting ramoji film city : Bengal Tiger Second schedule held in ramoji film city. In this spot romantic scenes are shooting among raviteja, rashi khanna and tamannah.

స్టేషన్ లో రొమాన్స్ చేస్తూ పట్టుబడ్డ తమన్నా, రాశి!

Posted: 04/24/2015 02:50 PM IST
Tamannah rashi khanna romance raviteja bengal tiger movie shooting ramoji film city

మిల్కీబ్యూటీ తమన్నా, బబ్లీ బ్యూటీ రాశి ఖన్నా ఇద్దరూ ఓ హీరోతో రొమన్స్ చేస్తూ స్టేషన్ లో పట్టుబడ్డారు. అయితే.. ఇది రియల్ లైఫ్ లో జరిగిన సంఘటన అయితే కాదులెండి.. వీరిద్దరూ కలిసి నటిస్తున్న ఓ మూవీ షూటింగ్ నిమిత్తం తెరకెక్కిస్తున్న సన్నివేశం!

వివరాల్లోకి వెళ్తే.. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ‘బెంగాల్ టైగర్’ సినిమా రూపొందుతోంది. ఈ మూవీలో రవితేజ సరసన తమన్నా, రాశి ఖన్నాలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తికాగా.. రెండో షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో భాగంగా ఈ చిత్ర టీం శంషాబాద్ లో ఓ యాక్షన్ ఎపిసోడ్ ని ఫినిష్ చేశారు. అక్కడ షూటింగ్ ముగిసిన అనంతరం యూనిట్ బృందం అక్కడి నుంచి రామోజీ ఫిల్మ్ సిటీకి షిఫ్ట్ అయ్యింది. ప్రస్తుతం ఈ రామోజీ ఫిల్మ్ సిటీలోని రైల్వే స్టేషన్ లో కొన్ని సన్నీవేషాలను షూట్ చేస్తున్నారు. ఈ షూటింగులో భాగంగానే రైల్వే స్టేషన్ లో రవితేజ సెక్సీ భామలైన తమన్నా, రాశి ఖన్నాలతో రొమాన్స్ చేస్తున్నాడు.

అలాగే.. అక్కడ మరికొన్ని ఫ్యామిలీ, యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. రవితేజ బాడీ లాంగ్వేజ్ కి సూటయ్యే విధంగా దర్శకుడు సంపత్ నంది అవుట్ & అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ సిద్దం చేశారని యూనిట్ వర్గాల చెబుతున్నాయి. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బొమన్ ఇరానీ, నాజర్, తనికెళ్ల భరణి, రావు రమేష్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : raviteja  bengal tiger  tamannah bhatia  rashi khanna  

Other Articles