Mahesh Babu Latest Flick Srimanthudu Movie Photos Leaked | Actress Sukanya

Mahesh babu srimanthudu latest photos leaked actress sukanya

mahesh babu news, mahesh babu updates, mahesh babu movies, mahesh babu srimanthudu, srimanthudu movie, mahesh babu sukanya, mahesh babu sukanya scenes, sukanya photos, srimanthudu movie gossips, shruti hassan

mahesh babu srimanthudu latest photos leaked actress sukanya : Tollywood prince mahesh babu Latest Flick Srimanthudu Movie Photos in which babu and sukanya are appeared.

‘శ్రీమంతుడు’ ఫోటోలు లీక్.. బాబుతో సుకన్య

Posted: 04/22/2015 12:10 PM IST
Mahesh babu srimanthudu latest photos leaked actress sukanya

ఆగమైన ‘ఆగడు’ తర్వాత ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే! ఈ చిత్రానికి ‘శ్రీమంతుడు' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ఇందులో మహేష్ సరసన శృతిహాసన్ తొలిసారగా జతకడుతోంది. ఇక బెంగాళి భామ అంగానా రాయ్ కూడా ఓ స్పెషల్ పాత్రలో నటిస్తోంది. వీరితోపాటు మరికొంతమంది ప్రముఖ నటీనటులు కూడా ఇందులో నటిస్తున్నారు. ముఖ్యంగా గతకొన్నాళ్ల నుంచి ఇండస్ట్రీకి కనుమరుగైన కొందరు సీనియర్ నటులు ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారని సమాచారం!

srimanthudu-latest-photos-1

ఇదిలావుండగా.. ప్రస్తుతం చిత్రీకరణ దశలో వున్న ఈ మూవీకి సంబంధించి తాజాగా కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. ఆ ఫోటోల్లో మహేష్ బాబు అచ్చం టైటిల్ కు తగ్గట్టే చాలా సింపుల్ గా, డీసెంట్ గా కనువిందు చేశాడు. ఇక ఈ చిత్రంలో ఓ పాత్రలో నటిస్తున్న సుకన్య కూడా ఆ ఫోటోల్లో దర్శనమిచ్చింది. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య జరిగే మాటల సంభాషణకు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఈ సినిమాను బాగా ప్రచారం చేసుకోవడం కోసమే ఇలా ఫోటోలను మధ్యమధ్యలో లీక్ చేస్తున్నారని సినీ విశ్లేషకులు
అభిప్రాయపడుతున్నారు. గతంలో అంగనాతో మహేష్ కలిసి వున్న ఫోటోతోపాటు షూటింగ్ కి సంబంధించి రెండు మూడు ఫోటోలు కూడా లీక్ అయ్యాయి.

srimanthudu-latest-photos-3

ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ మలేసియాలో జరుగుతోంది. దానికి సంబంధించిన సుకన్య, మహేష్ ఫోటో ఇప్పుడు బయటకు వచ్చింది. మహేష్‌, శ్రుతి, జగపతిబాబు తదితరులపై ఏప్రిల్ 22 వరకూ అక్కడే కీలకమైన సన్నివేశాలు తెరకెక్కిస్తారు. ఇక దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, అలీ, వెన్నెల కిషోర్‌, సితార, తులసి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu  srimanthudu  sukanya  shruti hassan  

Other Articles