Kannada Super Star Upendra praises Allu Arjuns Acting Skills | Son Of Satyamurthy

Kannada hero upendra praises allu arjun acting stylish skills

Upendra news, Upendra press meet, Upendra photos, Upendra controversy, Upendra kannada movies, Upendra telugu movies, Upendra son of satyamurthy, allu arjun, allu arjun latest news, allu arjun controversies, allu arjun son of satyamurthy, son of satyamurthy collections, samantha, nitya menon, adah sharma, tollywood news

Kannada Hero Upendra praises allu arjun acting stylish skills : Kannada Super Star Upendra praises Stylish star Allu Arjuns Acting and stylish Skills. He gave a name to bunny as smart hero.

ఇక నుంచి బన్నీ ‘స్టైలిష్’ కాదు.. ‘స్మార్ట్’ హీరో!

Posted: 04/22/2015 11:01 AM IST
Kannada hero upendra praises allu arjun acting stylish skills

‘గంగోత్రి’ నుంచి నిన్న వచ్చిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ మూవీ వరకు హీరో అల్లు అర్జున్ ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రల్లో కనువిందు చేశాడు. మెగాఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ.. తన ప్రతిభతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును క్రియేట్ చేసుకున్నాడు. నటనలో పూర్తిగా ఒదిగిపోయి అందులో జీవం పోయడమేకాకుండా.. తన స్టైలిష్ మేనరిజంతో ఎందరినో అభిమానులను సొంతం చేసుకున్నాడు. తాను తీయబోయే చిత్రంలో ఏదో ఒక కొత్తదనాన్ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తాడు. అందుకే.. ఈ హీరోకి ‘స్టైలిష్ స్టార్’ అని ప్రత్యేకంగా గుర్తింపు లభించింది. ఇటువంటి హీరోకి తాజాగా కన్నడ సూపర్ స్టార్ అయిన ఉపేంద్ర ‘స్మార్ట్ హీరో’ అంటూ తాజాగా కితాబిచ్చాడు.

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర.. ‘ఉపేంద్ర’, ‘రా’, ‘ఏ’, ‘సూపర్’ లాంటి సినిమాల ద్వారా తెలుగులో కూడా మంచి గుర్తింపు పొందిన విషయం తెలిసిందే! అయితే ఆ మూవీ తర్వాత మళ్లీ ఈయన తెలుగు తెరమీద కనిపించలేదు. అయితే.. చాలా రోజుల తర్వాత ఈయన ‘S/O సత్యమూర్తి’ మూవీ ద్వారా తిరిగి మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ మూవీలో దేవరాజ్ పాత్రలో నటించిన ఈయన.. రాయలసీమ యాసలో మాట్లాడుతూ ప్రేక్షకులను మెప్పించాడు. తన అద్భుత నటనను మరోసారి కనబరిచి సినిమాకి హైలైట్ గా నిలిచాడు. ఇక ఈ మూవీ మంచి విజయం సాధించిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలోనే బన్నీని ‘స్మార్ట్ హీరో’ అంటూ ఆయన కితాబిచ్చాడు.

ఈ నేపథ్యంలోనే ఓ మీడియా ప్రతినిధి... ‘స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో వర్క్ చేయడం ఎలా ఉంది’ అని ప్రశ్నించారు. ఇందుకు ఉపేంద్ర సమాధానమిస్తూ.. ‘ఆర్య సినిమా నుంచి నేను బన్నికి పెద్ద అభిమానిని. అతని యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. అన్నిటికంటే తన నటనని చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. త్రివిక్రమ్ ఎంత స్మార్ట్ దర్శకుడో, అంతకన్నా స్మార్ట్ హీరో అల్లు అర్జున్’ అని అన్నాడు. ఈ విధంగా ఈయన బన్నీని ప్రశంసించిన నేపథ్యంలో అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

ఇదిలావుండగా.. ఏప్రిల్ 9వ తేదీన విడుదలైన ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతోపాటు బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లను రాబడుతోంది. ఇందులో అల్లు అర్జున్ సరసన సమంత, ఆద శర్మ, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటించారు. తెలుగులో హిట్ అయిన ఈ సినిమా అటు కన్నడలోనూ భారీ విజయాన్ని అందుకుంది. అలాగే.. మంచి కలెక్షన్లను కూడా రాబడుతోంది. త్వరలోనే మలయాళంలో కూడా రిలీజ్ చేయనున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : son of satyamurthy  upendra  allu arjun  samantha  

Other Articles