మంచు విష్ణు హీరోగా స్వీయనిర్మాణంలో ‘డైనమెట్’ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే! 2014లో తమిళంలో రూపొంది విజయం సాధించిన ‘అరిమ నంబి’ సినిమాకు రీమేకే ఈ ‘డైనమైట్’. ఇందులో విష్ణు సరసన ప్రణీత హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను ‘వెన్నెల’, ‘ప్రస్థానం’ లాంటి అర్థవంతమైన సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు దేవాకట్టా తెరకెక్కిస్తున్నారు. ‘ఆటో నగర్ సూర్య’ సినిమాతో ఘోర పరాభావాన్ని ఎదుర్కొన్న ఈ దర్శకుడు.. ఈసారి విష్ణుతో కలిసి ‘డైనమెట్’ పేలిపోయేలా ఘన విజయాన్ని నమోదు చేసుకోవాలన్న ఆశతో దీనిని అద్భుతంగా తీస్తున్నారు.
యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా విష్ణు ట్విటర్ వేదికగా తెలిపారు. నిన్నటివరకు రామానాయుడు స్టూడియోలో వేసిన సెట్లో ఓ పాట షూటింగ్ జరిగింది. ఆ పాటతో ఈ షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరిగిపోతున్నాయి. ఇటీవలే ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ విడుదలైన సంగతి తెలిసిందే! ఇప్పుడు ఈ సినిమా ఆడియోను మే నెల మొదటి వారంలో రిలీజ్ చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. అలాగే మే నెల మూడో వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు అధికారికంగా విడుదల కానున్నాయి.
ఇక ఈ సినిమాలో మంచు విష్ణు సరికొత్త గెటప్ లో కనిపించనున్నాడని యూనిట్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇదివరకు నటించిన సినిమాలన్నింటిలో కంటే ఈ మూవీలో విష్ణు పాత్ చాలా విభిన్నంగా వుంటుందని.. ఈ మూవీ ప్రేక్షకులను బాగా అలరిస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
AS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more