karishma kapoor neerus stores launched hyderabad city culture women tradition | 63139

Karishma kapoor neerus stores launched hyderabad city culture women tradition

karishma kapoor, karishma kapoor news, karishma kapoor updates, karishma kapoor brands, karishma kapoor neerus shopping mall, karishma kapoor neerus stores, bollywood actress, bollywood kapoor family, kapoor family updates

karishma kapoor neerus stores launched hyderabad city culture women tradition : On Friday bollywood actress karishma kapoor had launched neerus stores in secunderabad karkhana kukatpally hyderabad.

బాలీవుడ్ తార నోట హైదరాబాద్ స్పీచ్..

Posted: 04/18/2015 11:12 AM IST
Karishma kapoor neerus stores launched hyderabad city culture women tradition

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో తరాలుగా కొనసాగుతూ వస్తున్న ‘కపూర్’ కుటుంబం నుంచి వచ్చిన నటి కరిష్మా కపూర్.. తన విలక్షణ అభినయంతో పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన అందంతో యూత్ ని కట్టేపడేసిన ఈ భామ.. తన నటనతో ఫ్యామిలీ ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది. అయితే.. వివాహానంతరం ఇండస్ట్రీకి దూరమైన ఈ అమ్మడు.. రెండో ఇన్నింగ్స్ పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు చేసింది కానీ అవి బెడిసికొట్టాయి. దాంతో మూవీల మీద అంతగా దృష్టి సారించకుండా కొన్ని ప్రైవేట్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా చెలామణి అవుతోంది. ఈ క్రమంలోనే ఈమె వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న నీరూస్ స్టోర్స్‌ ఓపెనింగ్ వేడుకలో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌లో తళుక్కుమంది.

ఈ సందర్భంగా కరీష్మా హైదరాబాద్ కల్చర్, ఇక్కడి మహిళలు ఔన్నత్యంపై తన అభిప్రాయాలను వెల్లడించింది. ‘ముంబైలాంటి మెట్రో సిటీస్‌లో వెస్ట్రన్ కల్చర్ ఫాలో అయ్యే యూత్ సహజంగా వుంటారు కానీ హైదరాబాద్ లేడీస్ వెస్ట్రన్ స్టైల్స్‌ని ఎంత ఫాలో అవుతారో.. ట్రెడిషనల్ వేర్‌ని అంతే ఇష్టపడతారు. షూటింగ్ పర్పస్ కన్నా ఏదో ఒక మాల్ లేక ఇతర ఓపెనింగ్స్‌కి హైదరాబాద్‌కి తరచూ వస్తూనే వున్నాను. కార్లో వెళ్లేటప్పుడూ చుట్టూ గమనిస్తుంటా. ఇంతపెద్ద మెట్రో సిటీలో కూడా అమ్మాయిలు చాలా ట్రెడిషనల్‌గా కనిపించడం చూసి ఎంతో ముచ్చటేస్తుంది. నేనూ అంతే... ఎన్నో ఏళ్లుగా సినీ పరిశ్రమతో ముడిపడి వున్నప్పటికీ.. వెస్ట్రన్ వేర్‌ను ఎంత ఇష్టపడతానో... భారతీయ సంస్కృతి సంప్రదాయాలను అంతే గౌరవిస్తాను’ అని సంతోషంగా వ్యక్తపరిచింది.

అలాగే అమ్మాయిల గురించి తన అభిప్రాయం వెల్లడిస్తూ.. ‘అమ్మాయి అంటే ఫెమినిటీ మిస్సవ్వకుండానే.. మగవాళ్లకు ఏ రకంగానూ తీసిపోము అని ప్రతిబింబించేలా ఉండాలని కోరుకుంటాను. అలా ఉన్నవాళ్లను చూసినప్పుడు ఆడపిల్లగా పుట్టినందుకు గర్వపడతాను. మరో జన్మంటూ ఉంటే ఆడపిల్లగా పుట్టడానికే ఇష్టపడతాను. ఇక వేరే దేశాలకు వెళ్లినా.. నేను ఇండియన్ అని తెలిసే విధంగానే నా డ్రెస్సింగ్ ఉంటుంది. వేరే వాళ్లను కలిసినప్పుడు విష్ చేయడానికి ‘హాయ్’, ‘హలో’ కంటే నమస్తేనే ప్రిఫర్ చేస్తాన’ని తెలిపింది. ఇక డ్రెస్సింగ్ విషయంలోనూ తాను చాలా సెన్సిటివ్ గా వుంటానని తెలిపింది. తనకు ఇండో వెస్ట్రన్ వేర్ అంటే ఎంతో ఇష్టమని.. ముఖ్యంగా ఇంగ్లిష్ కలర్స్ అంటే ఎక్కువ ప్రేమ అని కరీష్మా తెలిపింది.

ఇక చివరగా హైదాబాద్ ఫుడ్ గురించి మాట్లాడుతూ.. ‘స్పైసీ ఫుడ్ అంటే నాకు అంతగా ఇష్టం ఉండదు. కానీ హైదరాబాద్‌లో ఏ హోటల్‌కు వెళ్లినా బిర్యానీనే మొదట ఆఫర్ చేస్తాను. ఇరానీ చాయ్ విత్ ఉస్మానియా బిస్కెట్స్ అన్నా మనసు పారేసుకుంటాను’!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : karishma kapoor  neerus stores  hyderabad city culture  women tradition  

Other Articles