Vikram | 10 enradhukulla movie | first look poster | Samantha

10 enradhukulla movie first look released

10 enradhukulla movie first look, 10 enradhukulla, Vikram latest news, samantha vikram news, samantha hot news, Vikram stills, samantha kollywood, samantha tamil movies, samantha movie updates, samantha news

10 enradhukulla movie first look released: vikram latest film 10 enradhukulla. The film is directed by Goli Soda director Vijay. Samantha heroine.

స్టైలిష్ ‘10 ఎన్రాదుకుల్ల’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Posted: 04/17/2015 12:26 PM IST
10 enradhukulla movie first look released

‘అపరిచితుడు’, ‘మల్లన్న’, ‘ఐ’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన హీరో విక్రమ్ పుట్టినరోజు నేడు(ఏప్రిల్ 17). తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా విక్రమ్ కు భారీ క్రేజ్ వుంది. ఈ పుట్టినరోజు సంధర్భంగా విక్రమ్ కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తుంది తెలుగు విశేష్.

విక్రమ్ హీరోగా నటిస్తున్న తాజా తమిళ చిత్రం ‘10 ఎన్రాదుకుల్ల’. ‘గోలీసోడా’ ఫేం విజయ్ మిల్టన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విక్రమ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో సమంత మోడ్రన్ అమ్మాయిగా, నేపాలీ విలేజ్ అమ్మాయిగా రెండు విభిన్న పాత్రలలో నటిస్తోంది. అయితే విక్రమ్ పుట్టినరోజు సంధర్భంగా ఈ చిత్రంలోని విక్రమ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు.

ఇందులో విక్రమ్ చాలా స్టైలిష్ గా, యూత్ గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. డి. ఇమాన్ సంగీతం అందిస్తున్నాడు. జాకీష్రాఫ్ మరియు ఛార్మింగ్ గర్ల్ ఛార్మి ఓ ఐటెం సాంగులో చిందేయనున్నారు. మురుగదాస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా మే నెలలో విడుదల చేయనున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ మీకోసం అందిస్తున్నాం.. మీరు ఓ లుక్కేయండి.

Vikram-10-enradhukulla-movi

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vikram  10 enradhukulla movie  first look poster  Samantha  

Other Articles