Sampoornesh Babu | Kobbari Matta Movie | Kobbari Aakulu Song

Sampoornesh babu kobbari matta movie song released

Kobbari Matta Movie Kobbari Aakulu Song, Kobbari Matta Movie Song, sampoornesh babu apologies, kobbari matta song release date, sampoornesh babu song in kobbari matta, sampoornesh babu news, sampoornesh babu singing song, sampoornesh babu kobbari matta, kobbari matta movie, kobbari matta trailer, sampoornesh babu movies list

Sampoornesh Babu Kobbari Matta Movie Song Released: Watch First Song from Kobbari Matta Movie sung by Sampoornesh Babu. Directed by Rupak Ronaldson, Written by Steven Shankar. Produced by Amrutha Productions & Adi Kumbagiri. Burning star sampoornesh babu sing a song in his upcoming movie kobbari matta. This song will be released.

సంపూ నోట.. కొబ్బరిమట్ట పాట.. మళ్లీ కామెడీతో చంపేసాడు!

Posted: 04/16/2015 10:09 AM IST
Sampoornesh babu kobbari matta movie song released

బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు ‘హృదయకాలేయం’ చిత్రంతో భారీ క్రేజ్ ను సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో భారీ పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పి, అందరికి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతెప్పించిన విషయం తెలిసిందే. సంపూ భారీ యాక్షన్ చేసిన కూడా కామెడీ చేసినట్లుగానే వుంటుంది. అలాంటిది సంపూ పాట పాడితే ఇంకెలా వుంటుందో మీరే ఊహించుకోండి.

సంపూ నటిస్తున్న తాజా చిత్రం ‘కొబ్బరిమట్ట’. ఈ చిత్రంలో తాను ఓ పాట పాడానని, ఈ పాటను ఏప్రిల్ 15, 2015 సాయంత్రం 6గంటలకు విడుదల చేయబోతున్నట్లుగా సంపూ ప్రకటించిన విషయం తెలిసిందే. అనుకున్నట్లుగానే ఈ పాటను సంపూ నిన్న విడుదల చేసాడు.

ఈ పాటను సంపూ పాడాడు అంటే ఎవరూ నమ్మలేకపోతున్నారు. బొంగురు గొంతుతో భారీ క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న సంపూ గొంతు ఇలా సున్నితంగా ఎలా మారిందో అర్ధం కావడంలేదు. పాటను సంపూ పాడినప్పటికీ కూడా... ఈ గొంతు సంపూదే అంటే ఎవరూ నమ్మరు.

ఎందుకంటే వాయిస్ మొత్తం మార్చేసారు. ఎవరో వేరే వాళ్లతో పాడించినట్లుగా అనిపిస్తుంది. ఇక ఈ పాట మేకింగ్ సమయంలో పక్కనున్న వారి ఓవరాక్షన్... బాబోయ్.. అసలు మాములుగా నటించట్లేదు... జీవించేస్తున్నారు. సంపూ కంటే గొప్ప నటులు అన్నట్లుగా వున్నారు. పాట మొదలవ్వడమే ఏదో బాధాకరమైన పాట వలే అనిపిస్తూ వుంటుంది.

దీనికి తోడు పక్కనున్న వారి హవాభావాలు... వామ్మో... సంపూ ఈ పాట మేకింగ్ లోనే ఇంత రచ్చ చేస్తే... ఇక ఈ సినిమాలో ఇంకెంత చేస్తాడో అని అందరూ కామెంట్లు చేస్తున్నారు. ఏంటి నమ్మట్లేదు కదా మీరు! సరే.. మీరు ఓ సారి ఈ వీడియో చూడండి. కానీ నవ్వకండి ప్లీజ్..!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sampoornesh Babu  Kobbari Matta Movie  Kobbari Aakulu Song  

Other Articles