Son of Satyamurthy | Thanks meet | Collections

Son of satyamurthy thanks meet on 18 april

Son of Satyamurthy Thanks meet, Son of Satyamurthy Movie Thanks meet, Son of Satyamurthy Movie Thanks meet date, Son of Satyamurthy latest news, Son of Satyamurthy movie news, Son of Satyamurthy stills, Son of Satyamurthy movie posters, Son of Satyamurthy songs, Son of Satyamurthy

Son of Satyamurthy Thanks meet on 18 April: Allu Arjun latest hit movie Son of Satyamurthy. This movie Thanks meet will be on 18 April.

ఈనెల 18న గ్రాండ్ గా సన్నాఫ్ సత్యమూర్తి థ్యాంక్స్ మీట్

Posted: 04/15/2015 04:34 PM IST
Son of satyamurthy thanks meet on 18 april

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ ద‌ర్శక‌త్వంలో తెరకెక్కించిన చిత్రం 's/o స‌త్యమూర్తి' ఏప్రిల్ 9న అత్యధిక ధియేట‌ర్స్ లొ విడుద‌లైంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ 's/o స‌త్యమూర్తి' చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషించారు. ఇతర పాత్రల్లో సింధుతులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్ నటించారు.

ఈచిత్రం ఓపెనింగ్ డే నే సూప‌ర్‌హిట్ టాక్ ని సాధించ‌డమే కాకుండా రికార్డు క‌లెక్షన్లను రాబ‌ట్టింది. అన్ని ఏరియాల్లో పబ్లిక్ టాక్ తో దూసుకెళ్తోంది. టాలీవుడ్ టాప్ 3 ఓపెనింగ్ గ్రాస‌ర్ గా 's/o స‌త్యమూర్తి నిలిచింది. అంతేకాకుండా కర్నాటక తెలుగు చిత్రాల్లో టాప్ 1 గ్రాస‌ర్ గా నిల‌వ‌డం విశేషం. ఈ చిత్రం అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ క‌లెక్షన్ల రికార్డుల సాధిస్తుంద‌ని ట్రెడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా చిత్ర సక్సెస్ ను ప్రేక్షకులతో కలిసి పంచుకోనుంది చిత్ర యూనిట్.

ఈనెల 18న హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా థాంక్స్ మీట్ ను ఏర్పాటు చేయనుంది. గతంలో బ్లాక్ బస్టర్ మూవీ అత్తారింటికి దారేది చిత్రానికి సైతం ఇదే తరహాలో థాంక్స్ మీట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో సన్నాఫ్ సత్యమూర్తి చిత్ర యూనిట్ మొత్తం పాల్గొంటుంది.

ఈ కార్యక్రమ విశేషాల గురించి నిర్మాత ఎస్. రాధాకృష్ణ మాట్లాడుతూ.... " స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ ల కాంబినేష‌న్ తో మా బ్యానర్లో చిత్రీకరించిన 's/o స‌త్యమూర్తి' ఏప్రిల్ 9న గ్రాండ్ గా విడుద‌లైంది. అన్ని వ‌ర్గాల ప్రేక్షకుల నుంచి సూప‌ర్ హిట్ అనే టాక్ విన‌టం చాలా ఆనందంగా వుంది. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు తప్పకుండా థాంక్స్ చెప్పుకోవాల్సిందే. అందుకే ఈనెల 18న హైదరాబాద్ లో భారీ ఎత్తున థాంక్స్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ మొత్తం హాజరవుతుంది. అని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Son of Satyamurthy  Thanks meet  Collections  trailers  songs  stills  

Other Articles