Allu Arjun | Tweets | Birthday video

Allu arjun joins twitter

Allu Arjun joins twitter, Allu Arjun latest tweets, Allu Arjun latest Video, Allu Arjun birthday, Allu Arjun birthday stills, Allu Arjun latest news, Allu Arjun movie news, Allu Arjun movie updates, Allu Arjun news, Allu Arjun stills, Allu Arjun photos, Allu Arjun gallery

Allu Arjun joins twitter: Stylish star allu arjun birthday special video. allu arjun enter into social media twitter. bunny updated his latest video about his thoughts.

పుట్టినరోజున బన్నీ ముసలోడైపోతున్నాడట!

Posted: 04/08/2015 11:30 AM IST
Allu arjun joins twitter

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నేడు(ఏప్రిల్8) తన పుట్టినరోజు సంధర్భంగా సోషల్ మీడియా ట్విట్టర్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే విషయం తెలిసిందే. అయితే తాజాగా బన్నీ తన ట్విట్టర్లో ఓ వీడియోను పోస్ట్ చేసాడు. ఇక నుంచి తన అఫీషియల్ ట్విట్లర్ అకౌంట్ లో తన ఆలోచనలు, ఫోటోలు... అలాగే తన సినిమా వివరాలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తానని చెప్పుకొచ్చాడు. అలాగే తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికి కృతజ్ఞతలు చెబుతూనే... చివర్లో... ‘ముసలోల్లం అయిపోతున్నామయ్యా బాబు!’ అంటూ ముగించేసాడు.

Allu-Arjun-joins-twitter

ఈ సంధర్భంగా అల్లు అర్జున్ కు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది సినీవిశేష్. బన్నీ నటించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ రేపు(ఏప్రిల్ 9) ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లు దుమ్ములేపుతున్నాయి. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు.

అల్లు అర్జున్ సరసన సమంత, నిత్యామీనన్, ఆదాశర్మ హీరోయిన్లుగా నటించారు. ఉపేంద్ర, స్నేహ, రాజేంద్రప్రసాద్, ఆలీ, సింధు తులానీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. భారీ అంచనాలతో రూపొందిన ఈ చిత్రం మరి ఎలాంటి విజయం సాధించనుందో మరికొద్ది రోజుల్లో తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Tweets  Birthday video  

Other Articles