Swathi | Tripura | Movie launch

Swathi tripura movie launched today

Colors Swathi Tripura movie launch, Colors Swathi as Tripura, Colors Swathi tripura movie, Colors Swathi become tripura, Colors Swathi latest news, Swathi movie news, Swathi Tripura movie news, Swathi movie updates, Swathi stills, Swathi news

Swathi Tripura movie launched today: Actress swathi latest movie confirmed. movie title tripura. director raj kiran. Movie launched today.

ముహూర్త కార్యక్రమాలు జరుపుకున్న స్వాతి త్రిపుర

Posted: 04/06/2015 01:45 PM IST
Swathi tripura movie launched today

శ్రీనివాస్ రెడ్డి, అంజలి ప్రధాన పాత్రలో రాజకిరణ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గీతాంజలి’. ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత రాజకిరణ్ దర్శకత్వంలో మరో చిత్రం తెరకెక్కనుంది. స్వాతి ప్రధాన పాత్రలో రూపొందనున్న ఈ చిత్రానికి ‘త్రిపుర’ అనే టైటిల్ ఖరారు చేసారు.

ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలు నేడు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి దర్శకుడు బోయపాటి శ్రీను ముఖ్య అతిథిగా విచ్చేసారు. స్వాతి, పావని సమర్పణలో క్రేజీ మీడియా పతాకంపై ఎ. చినబాబు, ఎం. రాజశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈనెల 13 నుంచి 25 వరకు తొలి షెడ్యూల్ జరుగనుంది. స్వాతికి ఇది నటిగా మరో మంచి చిత్రం అవుతుందని ‘త్రిపుర’ చిత్ర యూనిట్ చెబుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

ఈ చిత్రానికి మాటలు: రాజా, స్ర్కీన్ ప్లే: శ్రీనివాస్ వెలిగొండ, సంగీతం: కమ్రాన్, కెమెరా: రవికుమార్ సానా, నిర్మాతలు: ఎ. చినబాబు, ఎం. రాజశేఖర్, రచన-దర్శకత్వం: రాజ కిరణ్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Swathi  Tripura  Movie launch  

Other Articles