Kangana Ranaut | Comments | Women empowerment

Kangana ranaut talks about on women empowerment

Kangana Ranaut Comments on Women empowerment, Kangana Ranaut Comments on My Choice, Kangana Ranaut latest Comments, Kangana Ranaut latest news, Kangana Ranaut movies, Kangana Ranaut movie updates, Kangana Ranaut stills, Kangana Ranaut news, Kangana Ranaut hot stills, Kangana Ranaut

Kangana Ranaut Talks About on Women empowerment: Actress Kangana Ranaut says Women empowerment does not mean you create complex among men. Then it will take 20 more years to empower men. It is all about evolving as a soul, as a human being. the video 'My Choice' must be appreciated for the effort towards promotion of women empowerment

కంగనా ఇంకా ఆ వీడియో చూడలేదట!

Posted: 04/04/2015 01:33 PM IST
Kangana ranaut talks about on women empowerment

దీపికా పదుకునే నటించిన ‘మై ఛాయిస్’ వీడియో దేశం మొత్తం సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియోపై ఆడవాళ్లే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీపికా పదుకునేపై చిత్రీకరించిన ఈ వీడియోలో.. నేను ఎలా బ్రతకాలి, ఎలాంటి దుస్తులు వేసుకోవాలి, నా శరీరం ఎలా ఉండాలి, పెళ్లికి ముందు సెక్స్, పెళ్లి తర్వాత సెక్స్ అనే అంశాలు పూర్తిగా నా ఇష్టం. ఎవరితో వుండాలి, ఎలా వుండాలి, మగాడిని పెళ్లి చేసుకోవాలా లేక ఆడవాళ్లను పెళ్లిచేసుకోవాలా అనేది ‘మై ఛాయిస్’ అంటూ దీపికా నటించింది.

అయితే ఈ వీడియోపై ఆడవాళ్లే భారీగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ఆడవాళ్లను తప్పుడు మార్గంలోకి తీసుకెళ్లే విధంగా వుందని, అయినా ‘వుమెన్ ఎంపవర్ మెంట్’ అంటే అసలైన అర్థం ఇది కాదని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. ఇటీవలే ఈ విషయంపై సోనాక్షి సిన్హా స్పందిస్తూ... వుమెన్ ఎంపవర్ మెంట్ అంటే నచ్చిన వారితో శృంగారం, వివాహేతర సంబంధం, నచ్చిన బట్టలేసుకోవడం లాంటివి కాదని,... వుమెన్ ఎంపవర్ మెంట్ అంటే ఉద్యోగం, మానసిక స్థైర్యం అని సోనాక్షి చెప్పుకొచ్చింది. వుమెన్ ఎంపవర్ మెంట్ అనేది ఎవరికి అవసరమో వారికే తప్ప... తమలాంటి విలాసాల్లో పుట్టినవాళ్లకు కాదని సోనాక్షి స్పష్టం చేసింది.

సోనాక్షి మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది మహిళలు ఈ ‘మై ఛాయిస్’ కు వ్యతిరేకంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ స్పందిస్తూ... సెక్సీగా వున్నంత మాత్రానా, సెక్సీ డ్రెస్సులు వేసుకున్నంత మాత్రానా మహిళా సాధికరత అనిపించుకోదు. అదంతా కేవలం భ్రమ మాత్రమే. ఆడవాళ్లు అభివృద్ధి చెందడమంటే మగవాళ్లను అణచివేయడం కాదు... స్త్రీల పట్ల పురుషులు మంచి దృక్పధాన్ని అలవరచుకోవాలని.. అలా జరగాలంటే ఇంకా చాలా కాలం పడుతుందని తన ఉద్దేశంమంటూ చెప్పుకొచ్చింది. అయితే తానింకా ‘మై ఛాయిస్’ వీడియో చూడలేదని చెప్పుకొచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kangana Ranaut  Comments  Women empowerment  My Choice Video  

Other Articles