Ram charan tej fans starts campaign for charity programmes

ram charan tej news, ram charan tej fans, charan fans charity programmes, ram charan fans charity trip, charan fans charity trip, ram charan charity programmes, ram charan movie updates, ram charan tej fans campaign

ram charan tej fans starts campaign for charity programmes : Mega Power star ram charan tej fans has started a special campaign for charity programmes where they collect money by travelling andhra pradesh, telangana and karnataka states.

చరణ్ బాటలోనే అభిమానుల స్ఫూర్తి నడక

Posted: 03/23/2015 03:48 PM IST
Ram charan tej fans starts campaign for charity programmes

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సమాజంలో మార్పు తేవడం కోసం కొన్ని స్ఫూర్తిదాయక పనులు చేపడతున్నారు. ఆమధ్య ‘హుధూద్’ తుఫాన్ వచ్చిన సందర్భంలో బాధితులకు తనవంతు సహాయాన్ని అందించి, తెలుగు ఇండస్ట్రీకి స్ఫూర్తిగా నిలిచాడు. ఆ తుపాన్ నేపథ్యంలో ఆకలితో అలమటిస్తున్న పేదప్రజలకు రూ.10 లక్షలమేర డబ్బులు ఇచ్చిన చెర్రీ.. అదే బాటలోనే సినీ ప్రముఖులందరినీ పయనించేలా చేశాడు.

అంతేకాదు.. పేదపిల్లల కోసం చారిటీ కార్యక్రమాలను చేపట్టడం, వారికి చదువు అందించడం, ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్న వారికి చికిత్స అందించడం వంటి సహాయ చర్యలను అందిస్తున్నాడు చెర్రీ! ఇలా చెర్రీ చేపట్టిన పనులకు ఇన్స్పైర్ అయిన అతని అభిమానులు.. ఇప్పుడు ఆయన బాటలోనే నడుస్తూ ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నారు. ఫ్యాన్స్ అంతా ఒకటిగా కలిసి.. సొసైటీలో మంచి పనులకి దోహదపడేందుకు తమవంతు కృషి చేస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో చెర్రీకి ఎంతమేర ఫ్యాన్స్ ఫాలోయింగ్ వుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈసారి రాష్ట్రాల్లో కొన్ని వేలమంది అభిమానులు ఇప్పుడు ఒకటిగా కలిసి ఎంతో మందికి స్ఫూర్తినిచ్చే ఓ కార్యక్రమాన్ని చేపట్టారు. అభిమానులంతా చారిటీ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మార్చి 27 తిరిగి డబ్బులు కలెక్ట్ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలోనే వీరంతా ఖమ్మంలో ఒకటై.. ఇప్పటికే ఈ పనిని ప్రారంభించారు.

ఈ ట్రిప్ లో భాగంగా భారీగా అమౌంట్ ని కలెక్ట్ చేసి.. ఈనెల 27వ తేదీన రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా కొన్ని చారిటీ పనుల కోసం ఖర్చు చేయనున్నారు. ఈ విధంగా చెర్రీ ఫ్యాన్స్ చేస్తున్న ఈ కార్యక్రమాన్ని చూసి.. ఎందరో ప్రశంసిస్తున్నారు. ఈ స్మాల్ ఛేంజ్ సొసైటీలో ముందు ముందు మంచి పనులకి దారితీస్తుందని అంటున్నారు. ఇక తన అభిమానులు చేపట్టిన ఈ పనికి చెర్రీ హర్షం వ్యక్తం చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ram charan tej  charan fans charity programme  tollywood news  

Other Articles