Thaman to replace anirudh for ram charan latest film

Thaman to replace Anirudh for Ram Charan film, Thaman Music for Ram Charan Latest film, Ram charan latest movie news, rakul preet singh, rakul preet singh hot photos, ram charan latest news, director srinu vaitla news, ram charan srinu vaitla news, my name is raju movie, my name is raju movie updates, tollywood gossips, cherry new movie project

Thaman to replace Anirudh for Ram Charan Latest film: Ram charan upcoming movie My name is raju in srinuvaitla direction. dvv danayya producer, rakul preet sing heroine. anirudh music.

చెర్రీ సినిమాకు థమన్ సౌండ్ ఫిక్స్

Posted: 03/20/2015 11:17 AM IST
Thaman to replace anirudh for ram charan latest film

రాంచరణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు నుంచి తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ తప్పుకున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమయ్యాయి. మొదటి షెడ్యూల్ మరో రెండు రోజుల్లో పూర్తి కానుంది.

రెండవ షెడ్యూల్ ఏప్రిల్ 2 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ చిత్రానికి అనిరుధ్ ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు. కానీ అనిరుధ్ ప్రస్తుతం తమిళంలో వరుస చిత్రాలతో బిజీగా వుండటం వలన ఈ సినిమాపై ఆసక్తి కనబరచకపోవడంతో... ఈ ప్రాజెక్ట్ నుంచి అనిరుధ్ తప్పుకున్నాడు.

దీంతో ఈ సినిమాకు థమన్ ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసారు. గతంలో శ్రీనువైట్ల, థమన్ కాంబినేషన్లో ‘దూకుడు’, ‘బాద్ షా’, ‘ఆగడు’ వంటి చిత్రాలొచ్చాయి. అలాగే రాంచరణ్, థమన్ కాంబినేషన్లో ‘నాయక్’ అనే హిట్ చిత్రం వచ్చింది. కాబట్టి.. ఈ ముగ్గురి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా కూడా మ్యూజికల్ హిట్ గా నిలుస్తుందని చిత్ర యూనిట్ భావిస్తున్నారు.

ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ రచయితలు కోనవెంకట్, గోపి మోహన్ లు కలిసి కథ, మాటలు అందిస్తున్నారు. రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. అక్టోబర్ 15న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Thaman  replace  Anirudh  Ram Charan  

Other Articles