Raghava lawrence kanchana2 movie latest stills

raghava lawrence Kanchana2 Movie Latest Stills, Kanchana2 Movie Second look stills, kanchana 2 first look, kanchana 2 movie updates, kanchana 2 movie news, raghava lawrence news, raghava lawrence kanchana 2, kanchana 2 movie trailer, kanchana 2 movie photos, kanchana 2 first look photos, tapsee pannu, tapsee pannu news, tapsee pannu kanchana 2, nitya menon news, nitya menon kanchana 2

raghava lawrence Kanchana2 Movie Latest Stills: raghava lawrence kanchana 2 movie first look released tapsee pannu nitya menon : Dancer cum director raghava lawrence latest flick kanchana 2 movie first look has released. In this movie tapsee pannu pairing with raghava and nitya menon playing a special role.

లారెన్స్ కాంచన2 లుక్స్ కిరాక్

Posted: 03/17/2015 12:25 PM IST
Raghava lawrence kanchana2 movie latest stills

ఒకప్పుడు డాన్స్ డైరెక్టర్ గా వున్నప్పుడు ఎంతో మంది అగ్ర స్టార్, యంగ్ హీరోలతో స్టెప్పులేయించిన రాఘవ లారెన్స్.... దర్శకుడిగా మారి పలు విభిన్న చిత్రాలను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ‘మాస్’ సినిమాతో దర్శకుడిగా మారిన లారెన్స్... ఆ తర్వాత ‘డాన్’, ‘స్టైల్’, ‘ముని’, ‘రెబల్’, ‘కాంచన’ వంటి పలు చిత్రాలను తెరకెక్కించాడు.

ఈ సినిమాలతో దర్శకుడిగా లారెన్స్ కు మంచి పేరొచ్చింది. అయితే ‘ముని’, ‘కాంచన’ చిత్రాలలో హీరోగా నటించిన లారెన్స్ నటనకు భారీ ప్రశంసలే దక్కాయి. అటు దర్శకుడిగా, ఇటు నటుడిగా మంచి ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం ఈ ‘ముని’, ‘కాంచన’ చిత్రాలకు సీక్వెల్ గా ‘కాంచన2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు లారెన్స్.

ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ పోస్టర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫోటోలను విడుదల చేసారు. ఈ ఫోటోలను చూస్తుంటే... ‘కాంచన2’ చిత్రం మరో బ్లాక్ బస్టర్ హిట్టవ్వడం ఖాయమని పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.

ఇందులో లారెన్స్ సరసన తాప్సీ హీరోయిన్ గా నటిస్తుంది. లారెన్స్ ఇందులో పలు విభిన్న పాత్రలలో నటించనున్నట్లుగా తెలిసింది. సన్ పిక్చర్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్ర ఆడియోను విడుదల చేసి, ఏప్రిల్ లో సినిమా విడుదల చేయనున్నారు.

Related Gallerys:

Kanchana 2 Movie Stills

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : raghava lawrence  Kanchana2  Second look  Posters  

Other Articles