Mahesh babu brahmotsavam movie music director mickey j mayer srikanth addala rakul preet singh

mahesh babu news, mahesh babu movies, bramhotsavam movie, bramhotsavam movie news, music director mickey j mayer, mickey j mayer updates, rakul preet singh news, mahesh babu rakul preet, srikanth addala, srikanth addala movies, mickey j mayer movies

mahesh babu brahmotsavam movie music director mickey j mayer srikanth addala rakul preet singh : Mickey j mayer has finalised as music composer to mahesh babu's latest flick brahmotsavam. In this movie Rakul preet is pairing with mahesh.

మిక్కీ మాయలో మహేష్ పడిపోయాడు...!

Posted: 03/11/2015 01:08 PM IST
Mahesh babu brahmotsavam movie music director mickey j mayer srikanth addala rakul preet singh

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘బ్రహ్మోత్సవం’ పేరిట ఓ మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే! పివిపి సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ రొమాన్స్ చేయనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ షూటింగును మే నెలాఖరులో ప్రారంభించేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఇదిలావుండగా.. మెలోడియస్ ట్యూన్స్ కి కేరాఫ్ అడ్రస్ అయిన మిక్కీ జే మేయర్ తాజాగా ఈ మూవీకి సంగీత దర్శకుడిగా ఫిక్సయినట్లు సమాచారం! ఫ్యామిలీ ఆడియెన్స్ కు మెచ్చేలా సాఫ్ట్ ట్యూన్స్ అందించే ఈ మ్యూజిక్ డైరెక్టర్ అందించే పాటలే తమ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘బ్రహ్మోత్సవం’కు బాగా సూటవుతాయన్న ఉద్దేశంతో ఆయన్ను తీసుకున్నారని యూనిట్ వర్గాలు తెలిపాయి. పైగా.. శ్రీకాంత్ కి, ఇతనికి మధ్య మంచి సన్నిహితం వుండటంతో ఆయన్నే ఎంపిక చేసుకోవడం జరిగిందని అంటున్నారు.

అంతేకాదు.. గతంలో మహేష్ నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రానికి కూడా ఈ మ్యూజిక్ కంపోజర్ మంచి ట్యూన్స్ అందించి మార్కులు కొట్టేశాడు. అప్పుడు అతను అందించిన పాటలకు ఫ్లాటైన మహేష్.. తన తదుపరి ఫ్యామిలీ చిత్రానికి మిక్కీ పాటలు అందిస్తే బాగుంటుందని దర్శకనిర్మాతలకు సలహా ఇచ్చాడట! ఏదైతేనేం.. మొన్నటివరకు చిన్ని సినిమాలకే మ్యూజిక్ అందించిన మిక్కీ.. ఇప్పుడు పెద్ద సినిమాలకు పాటలు కంపోజ్ చేసే స్థాయికి ఎదిగిపోయాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu  mickey j mayer  srikanth addala  rakul preet singh  bramhotsavam movie  

Other Articles