Sampoornesh babu don ghantasala role where is vidyabalan movie

sampoornesh babu news, sampoornesh babu comedy roles, sampoornesh babu movies, sampoornesh babu don ghantasala, don ghantasala role news, don ghantasala news, where is vidyabalan movie

sampoornesh babu don ghantasala role where is vidyabalan movie : Burning star sampoornesh babu doing another comedy role in where is vidyabalan movie as don ghantasala

విద్యాబాలన్ కోసం ‘డాన్’గా మారిన సంపూ

Posted: 03/04/2015 02:06 PM IST
Sampoornesh babu don ghantasala role where is vidyabalan movie

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ఓవైపు హీరోగా తన సినిమా షూటింగుల్లో బిజీగా వుంటూ.. మరోవైపు కామెడీ చిత్రాల్లో తమాషా పాత్రలు చేస్తున్నాడు. ఇటీవలే అల్లరి నరేష్ నటించిన ‘బందిపోటు’ మూవీలో సంపూ ఒక ప్రత్యేక పాత్రలో నటించాడు. కానీ.. ఆ పాత్ర ప్రేక్షకుల్ని అంతగా మెప్పించలేకపోయింది. అయితే.. సంపూ ఇప్పుడు ఓ మూవీలో మరో పవర్ ఫుల్ కామెడీ రోల్ లో నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

ప్రిన్స్ హీరోగా వస్తున్న ‘వేర్ ఈజ్ విద్యాబాలన్’ అనే క్రైం కామెడీ మూవీలో ‘డాన్ ఘంటసాల’గా సంపూ ఓ వెరైటీ రోల్ చేస్తున్నాడని సమాచారం. అయితే.. ఆ మూవీ యూనిట్ మాత్రం సంపూ రోల్ గురించి రివీల్ చేయకుండా చాలా సీక్రెట్ వుంచుతోంది. ఇటీవలే జరిగిన ప్రెస్ మీట్ లోనూ సంపూ క్యారెక్టర్ గురించి యూనిట్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రేక్షకులకు సర్ ప్రైజ్ ఇవ్వడం కోసమే ఇతని పాత్ర వివరాలు సీక్రెట్ గా వుంచుతున్నారని అంటున్నారు.

ఇక ఈ చిత్రంలో రావు రమేష్ ,ఆశిష్ విద్యార్ధి, జయప్రకాష్‌‌రెడ్డి, సప్తగిరి ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఈ నెలాఖర్లో రిలీజ్‌ రిలీజ్ చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ‘కథ’ ఫేం శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి కీ బోర్డ్ ప్లేయర్ కమ్రాన్ మ్యూజిక్ డైరెక్టర్‌‌‌గా పరిచయం అవుతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sampoornesh babu  don ghantasala  where is vidyabalan movie  

Other Articles