Balakrishna dance in prem rakshit choreography

Balakrishna to Dance in Prem rakshit choreography, Balakrishna Dance in lion movie, Lion Movie Satellite Rights, balakrishna news, balakrishna lion movie, lion telugu movie, balakrishna lion satelite rights, lion telugu movie news, lion movie satelite rights, balakrishna latest updates, director satyadeva, trisha krishnan news, radhika apte news

Balakrishna Dance in Prem rakshit choreography: Nandamuri Balakrishna latest movie Lion. Sathyadeva direction, trisha, radhika apte heroines. manishrama music.

ప్రేమ్ రక్షిత్ స్టెప్పులకు బాలయ్య స్టైలిష్ డాన్స్

Posted: 03/04/2015 10:41 AM IST
Balakrishna dance in prem rakshit choreography

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 98వ చిత్రం ‘లయన్’. సత్యదేవా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ తుదిదశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇందులో బాలకృష్ణ మరియు ప్రధాన నటీనటులు, సినిమాలో నటిస్తున్న బాలయ్య కుటుంబ సభ్యుల నేపథ్యంలో వచ్చే ఓ ఫ్యామిలీ సాంగ్ ను తెరకెక్కిస్తున్నారు.

ఈ పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ నేతృత్వంలో చిత్రీకరిస్తున్నారు. ‘యమదొంగ’ సినిమాలో ఎన్టీఆర్ వేసిన ‘నాచోరే...’ సాంగ్ ద్వారా భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్న ప్రేమ్ రక్షిత్... ప్రస్తుతం టాలీవుడ్ లోని స్టార్ హీరోలకు డాన్స్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ సాంగ్ తో ‘లయన్’ షూటింగ్ దాదాపు పూర్తవుతోంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ఇటీవలే విడుదలైన బాలయ్య ‘లయన్’ ఫస్ట్ లుక్ స్టిల్స్, ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. ఇటీవలే ఈ చిత్ర శాటిలైట్ హక్కులను ప్రముఖ జెమిని టీవి ఛానెల్ వారు భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లుగా సమాచారం.

రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్లుగా నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియో ఈనెల చివర్లో విడుదల చేయనున్నారు. ఏప్రిల్ లో సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Dance  Prem rakshit  

Other Articles