Nandamuri balakrishna fans lion gift news

nandamuri balakrishna, balakrishna news, balakrishna fans, balakrishna lion gift, balayya fans lion gift, balakrishna updates, anantapur jagan

nandamuri balakrishna fans lion gift news : Balakrishna fans to give a huge lion gift which made with granite worth ten lakhs on his 100 movie muhurtham.

బాలయ్యకు గిఫ్టుగా భారీ ‘సింహం’ బొమ్మ ఇస్తున్న ఫ్యాన్స్!

Posted: 02/28/2015 01:23 PM IST
Nandamuri balakrishna fans lion gift news

గతంలో వరుస పరాజయాలతో వెనుకపడిపోయిన నందమూరి బాలకృష్ణ.. ‘సింహా’ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన విషయం తెలిసిందే! ఇక ఆ తర్వాత వచ్చిన ‘లెజెండ్’ చిత్రం కూడా 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ప్రస్తుతం ఆయన తన 98వ చిత్రమైన ‘లయన్’ షూటింగ్ లో బిజీగా వుండగా.. తర్వాత చేయబోయే 99వ చిత్రాన్ని ఈరోస్ ఇంటర్నేషన్ నిర్మించేందుకు సిద్ధమైంది. ఆ చిత్రాన్ని ‘లౌక్యం’ ఫేం దర్శకుడు తెరకెక్కించనున్నాడు.

ఇక ఈ మూవీ తర్వాత ఆయన చేయబోయే 100వ చిత్రం కోసం టాలీవుడ్ సహా ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒక స్టార్ (ఎన్టీఆర్) కుమారుడిగా 100 చిత్రాలు చేసిన హీరోగా సాధించిన ఘనత ఏకైక వ్యక్తి ఈయనే కావడం విశేషం! దీంతో ఈయనకోసం నందమూరి అభిమానులు ఎంతో విలువైన ‘సింహం’ బొమ్మను బహుమతిగా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం! ఆయన 100వ చిత్రం ప్రారంభం నాటికి అది సిద్ధమవుతుందని, ఆ చిత్ర ప్రారంభోత్సవ సమయంలో దానిని బాలయ్యకు ఇవ్వాలని వాళ్లు నిర్ణయించుకున్నట్లుగా తెలుపుతున్నారు. ఆ బహుమతి ఖరీదు రూ.10,00,000 వుంటుందని, ఆ సింహపు బొమ్మను ‘గోధుమ రంగు క్రిస్టల్ గ్రానైట్’తో తయారు చేయించబోతున్నట్లుగా ఎన్.బీ.కే హెల్పింగ్ హ్యాండ్స్ స్థాపకుడు అనంతపురం జగన్ వెల్లడించారు.

ఈ నేపథ్యంలోనే జగన్ మాట్లాడుతూ.. ‘6 నుంచి 9 నెలల్లో ఈ లయన్ విగ్రహాన్ని సిద్ధం చేయించాలని అనుకుంటున్నాం. బాలయ్య 100వ చిత్రం ప్రారంభం నాటికి సిద్ధమవుతుందని ఆశిస్తున్నాం. ఒక స్టార్ కుమారుడిగా ఈ ఘనత సాధించబోతున్న ఏకైక వ్యక్తి ఆయనే! అందుకే.. ఆ క్షణాలను మేము సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాం. ఆ సమయంలోనే ఆయనకు ఈ ‘సింహం’ బొమ్మ బహుమతిని అందజేస్తాం’’ అంటూ తెలిపారు. ఈ విగ్రహంతోపాటు ‘నందమూరి శిఖరం’ అనే పుస్తకాన్ని రూపొందించి బాలయ్యకు సమర్పించాలనుకుంటున్నట్లుగా ఆయన పేర్కొన్నారు.

‘‘ఈ పుస్తకం తొలిపేజీని బాలయ్య సతీమణి వసుంధర రాస్తారు. వెయ్యి పేజీలతో వుండే ఈ పుస్తకంలో బాలయ్యతో పనిచేసిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల గురించి, బాలయ్య సినీ ప్రయాణం ప్రతిబింబించే విధంగా వుంటుంది’’ అని జగన్ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nandamuri balakrishna  balayya fans lion gift  

Other Articles