Genelia dsouza interview reentry movies riteish deshmukh

genelia dsouza, genelia deshmukh, genelia latest news, genelia photos, genelia hot photos, genelia son, genelia marriage news

genelia dsouza interview reentry movies riteish deshmukh : genelia deshmukh given clarification on her re entry in film industry.

జెనీలియా అటువంటి నిర్ణయం తీసుకోలేదట!

Posted: 02/26/2015 08:11 PM IST
Genelia dsouza interview reentry movies riteish deshmukh

చిత్రపరిశ్రమలో కొన్నాళ్లపాటు హీరోయిన్ గా ప్రత్యేక ప్రస్థానం ఏర్పరుచుకున్న జెనీలియా.. 2012లో బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ తో వివాహం చేసుకున్న తర్వాత వెండితెరకు దూరమైంది. ఆమధ్య రెండు సినిమాల్లో అతిథి పాత్రల్లో కనిపించింది కానీ.. అప్పటినుంచి కనుమరుగైంది. ఈ నేపథ్యంలోనే ఈమె ఓ కుమారుడికి జన్మనివ్వడంతోపాటు తమ సమయాన్ని పూర్తిగా కుటుంబానికే కేటాయించింది. వివాహానంతరం తన లైఫ్ మరింత ఆనందంగా కొనసాగుతోందంటూ ఆమధ్య సంతోషం వ్యక్తం చేసింది కూడా!

దీంతో ఈమె ఇక సినిమాల్లో రాకపోవచ్చంటూ పుకార్లు రావడం మొదలయ్యాయి. ఆమెకు మూవీ ఆఫర్లు రాకపోవడంతో ఆ రూమర్లు నిజమేనని అంతా అనుకున్నారు.అయితే.. తాను మాత్రం మళ్లీ సినిమాల్లో నటించడానికి సిద్ధంగా వున్నానంటూ ఆ రూమర్లను కొట్టిపారేసింది జెనీలియా! తాను సినిమాల నుంచి దూరంగా వెళ్లలేదని, అటువంటి నిర్ణయమే తీసుకోలేదని స్పష్టం చేసింది. బిడ్డ పుట్టిన నేపథ్యంలో ఇంటిపట్టునే వుండాల్సి రావడంతో సినిమాల నుంచి కాస్త విరామం తీసుకున్నట్లు ఆమె తెలుపుతోంది.

‘‘నేను సినిమాలను వదిలి దూరంగా వెళ్లలేదు. కాస్త విరామం తీసుకున్నానంతే! త్వరలో తిరిగి సినిమాల్లో ఎంట్రీ ఇవ్వడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. రీ ఎంట్రీకి రెడీ’’ అని అంటోంది. అయితే.. ప్రస్తుతం తన చేతిలో ఎటువంటి అవకాశాలు లేవని... మంచి కథ, పాత్రలు లభిస్తే నటిస్తానని చెబుతోంది. మరి.. ఈమెకు ఆఫర్లు వస్తాయో.. లేదో..? చూడాలి!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : genelia deshmukh news  telugu film industry  

Other Articles