Kanika dhillon anushka movie story writer prakash kovelamudi wife tollywood news

kanika dhillon news, kanika dhillon biography, kanika dhillon latest news, kanika dhillon movies, kanika dhillon story writer, anushka size zero movie, prakash kovelamudi news, prakash kanika dhillon, prakash kovelamudi new movie, anushka new movie updates

kanika dhillon anushka movie story writer prakash kovelamudi wife tollywood news : Another lady writer giving entry in tollywood who is wife of director prakash kovelamudi. She is giving story to anushka's size zero movie.

తెలుగు చిత్రపరిశ్రమకి మరో కొత్త లేడీ రైటర్

Posted: 02/25/2015 10:45 AM IST
Kanika dhillon anushka movie story writer prakash kovelamudi wife tollywood news

తెలుగు చిత్రపరిశ్రమలో ఇప్పటివరకూ విజయ నిర్మల, నందిని రెడ్డి, శశికిరణ్ నారాయణ లాంటివారు సినిమాలకు కథలు సమకూర్చి రైటర్ గా తమ టాలెంట్ ని నిరూపించుకున్నారు. ఇప్పుడు వీరి బాటలోనే మరో కొత్త లేడీ రైటర్ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ఆమె మరెవ్వరో కాదు.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కోడలు, ప్రకాష్ కోవెలమూడి భార్య అయిన కనిక ధిల్లన్ కోవెలమూడి!

అనుష్క ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి ‘సైజ్ జీరో’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభమైంది కూడా! ఈ సినిమాని పివిపి సినిమాస్ బ్యానర్ పై పొట్లూరి నిర్మించనున్నారు. ఈ చిత్రానికే కనిన థిల్లన్ కథని అందించింది. ఈ సినిమాకు కథను అందించడమే కాకుండా ఇదివరకే ఈమె రచయిత్రిగా తనను తాను నిరూపించుకుంది. ఇండియాలో బాగా సేల్ అయిన ‘బాంబే డక్ ఈజ్ ఎ ఫిష్’ అనే నవలను రాసి ఆమె పాపులర్ అయ్యింది. అంతేకాదు.. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన ‘ఓం శాంతి ఓం’, ‘బిల్లు బార్బర్’, ‘రా వన్’ వంటి పెద్ద సినిమాలకు ఈమె కో-రైటర్ గా పనిచేసింది. ఆ అనుభవంతోనే ఇప్పుడు ఆమె అనుష్క చిత్రానికి కథను అందిస్తోంది.

ప్రస్తుతం కనిక షారుఖ్ ఖాన్ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ లో క్రియేటివ్ కంటెంట్ డివిజన్ కి హెడ్ గానూ, అలాగే ఎన్డీటీవీ ఇమాజిన్ లో పనిచేస్తోంది. గత సంవత్సరం ఆగస్టులో ప్రకాష్, కనికల వివాహం జరిగింది. ఇదివరకే ఆమెకు రైటర్ గా అనుభవం వుంది కాబట్టి.. ప్రకాష్ తాను తెరకెక్కిస్తున్న ‘సైజ్ జీరో’ చిత్రం కథని సమకూర్చే పనిని తన భార్య కనికను అప్పగించినట్లు సమాచారం! ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. కనిక కథను అందించడంతోపాటు స్ర్కీన్ ప్లే కూడా అందిస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kanika dhillon  anushka shetty  prakash kovelamudi  size zero movie updates  

Other Articles