Arjun kapoor kapil dev life story movie ccl md vishnuvardhan induri bollywood news

arjun kapoor news, kapil dev news, arjun kapoor kapil dev, ccl md vishnuvardhan induri, kapil dev history, kapil dev life story, kapil dev life story movie, kapil dev cricket history, actor arjun kapoor news, arjun kapoor affairs, bollywood news

arjun kapoor kapil dev life story movie ccl md vishnuvardhan induri bollywood news : Bollywood young actor arjun kapoor to play kapil dev role in his latest movie which project is undertaken by ccl md vishnuvardhan induri.

క్రికెటర్ కపిల్ దేవ్ ని మరిపిస్తానంటున్న అర్జున్...

Posted: 02/20/2015 07:44 PM IST
Arjun kapoor kapil dev life story movie ccl md vishnuvardhan induri bollywood news

బోనీ కపూర్ వారసుడైన అర్జున్ కపూర్.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనతికాలంలోనే నటుడిగా మంచి గుర్తింపు సాధించాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. పరిశ్రమలో తనకంటూ ఓ ప్రస్థానాన్నీ ఏర్పాటు చేసుకున్నాడు. అయితే.. ఇప్పుడు క్రికెట్ బ్యాట్ పట్టుకుని మైదానంలో సత్తా చాటుతానని అంటున్నాడు. అంతేకాదు.. మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ ని మరిపించేంత సత్తా తనలో వుందని అతడు చెబుతున్నట్లుగా బాలీవుడ్ వర్గాల సమాచారం! ఇంతకీ.. ఇతను సినీ ఫీల్డ్ లో నుంచి క్రికెట్ మైదానంలోకి ఎందుకు ఎంట్రీ ఇస్తున్నాడనేగా మీ సందేహం? అది తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!

వివరాల్లోకి వెళ్తే... ప్రస్తుతం క్రికెట్ కు లభిస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని బాలీవుడ్ దర్శకనిర్మాతలు ఈ ఆట చుట్టూ అల్లిన కథలతో సినిమాలు నిర్మించేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే కెప్టెన్ ధోనీ జీవిత కథాధారంగా ఓ చిత్రం రూపొందుతోంది కూడా! ఈ క్రమంలోనే 1983 భారతదేశానికి వరల్డ్ కప్ తెచ్చిపెట్టిన మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ జీవితం ఆధారంగా ఓ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. సీసీఎల్ ఎండీ విష్ణువర్ధన్ ఇందూరి ఈ ప్రాజెక్టును చేపబడుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ కూడా దాదాపు చివరి దశకు చేరుకుందని బాలీవుడ్ యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇక ఈ చిత్రంలో కపిల్ దేవ్ పాత్రను పోషించాల్సిందిగా యువనటుడు అర్జున్ కపూర్ ని నిర్మాత సంప్రదించినట్లు సమాచారం! దీంతో ఆ నటుడు సంతోషంతో ఎగిరి గంతులేశాడట! కపిల్ దేవ్ లాంటి లెజెండరీ పాత్రను పోషించేందుకు తనకు చాలా సంతోషంగా వుందని వ్యక్తపరుస్తున్నాడు. ఈ సినిమాలో తన నటన ద్వారా కపిల్ దేవ్ ని మరిపిస్తానని, ఆయన పాత్రలో లీనమైపోయేందుకు ప్రయత్నిస్తానని అంటున్నాడు. ఇంకా ఈ మూవీకి సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles