Balakrishna 99th movie shooting details

Balakrishna Dictator‬ Movie Shooting Details, Balakrishna Dictator‬ Movie Release date, Balakrishna Dictator‬ Movie, Balakrishna movie title Dictator, Regina Cassandra Romance with Balakrishna, Regina Cassandra to pair up with Balakrishna, Regina Cassandra in Balakrishna next movie, balakrishna 99th film director Srivas, Balakrishna Latest news, Balakrishna movie news, Balakrishna Srivas movie, Balakrishna hot news, Balakrishna breaking news, Balakrishna latest updates, Balakrishna news updates, Srivas hot news, Srivas breaking news, Srivas latest updates, Srivas news updates, Balakrishna Dictator

Balakrishna Dictator‬ Movie Shooting Details: Nandamuri Balakrishna to pair up with Nayanthara in his 99th Movie. Srivas Direction Produced by Eros Banner. Thaman music.

దసరా టార్గెట్ ఫిక్స్ చేసిన డిక్టేటర్

Posted: 02/12/2015 12:58 PM IST
Balakrishna 99th movie shooting details

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ‘లయన్’ సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు. సత్యదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య సరసన త్రిష, రాధిక ఆప్టేలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే విడుదలై ఫస్ట్ లుక్ స్టిల్స్, ట్రైలర్లకు మంచి స్పందన వస్తోంది. ఎస్.ఎల్.వి సినిమా సంస్థలో నిర్మాత రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్ర ఆడియోను ఈనెల చివర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమా తర్వాత బాలకృష్ణ 99వ చిత్రం ప్రముఖ దర్శకుడు శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ వారు నిర్మించబోతున్నారు. కోన వెంకట్, గోపి మోహన్ లు కథను సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘డిక్టేటర్’ అనే టైటిల్ ఖరారు చేసారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయిన ఈ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

నయనతార హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా హన్సిక, రెజీనాల పేర్లు వినిపిస్తున్నాయి. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. హైదరాబాద్, డిల్లీ, యూరప్ లలో షూటింగ్ జరిపి, దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 40 కోట్ల బడ్జెట్ తో రూపొందనున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించనున్నాడు. ఈ ఏడాది దసరా బరిలో బాలయ్య ‘డిక్టేటర్’ సినిమా వుండటం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Srivas  Nayanthara  ?Dictator?  Kona venkat  telugu movies  news  

Other Articles