Ram shivam shoot in full swing

Ram, Ram shivam, Ram pandaga chesko, Ram shivam movie, ram busy cinema shedule, ram movie collections, ram hits, ram latest updates, ram latest news, ram upcomming movies, ram forth comming movies, gopichand malineni movies, ram to act with new director srinivas reddy, ram to tie up srinivas reddy

Young actor Ram is busy shooting for his latest film ‘Shivam’.

శివం షూటింగ్ లో పండగ చేసుకుంటున్న రామ్..

Posted: 02/11/2015 10:05 AM IST
Ram shivam shoot in full swing

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ వరుస సినిమా షూటింగ్ లతో బిజీగా మారాడు. ఒకపక్క పరుచూరి ప్రసాద్ నిర్మాతగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ‘పండగ చేస్కో’ సినిమా సెట్స్‌పై నుంచి త్వరలోనే పోస్ట్ ప్రోడక్షన్ పనులను వెళ్లనుంది. ఈ సినిమా రమారమి చివరి దశకు చేరుకునేలోపు రామ్ మరో రెండు సినిమాలకు సైన్ చేయడమే కాకుండా, అందులో మొదటగా శివం సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళాడు.

ఈసారి యంగ్ హీరో ఓ నూతన దర్శకుడికి ఓటేశారు. ‘కిక్’ ఫేమ్ సురేందర్‌రెడ్డికి శిష్యుడైన శ్రీనివాసరెడ్డి ఈ కొత్త చిత్రంతో నిర్దేశకుడిగా పరిచయమవుతున్నారు. ప్రచార ఆర్భాటాలకు దూరంగా సోమవారం ఈ చిత్రం షూటింగ్ లాంఛనంగా ప్రారంబమైంది. మొదలు పెట్టిన మరుసరి రోజు నుంచే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ని హైదరాబాద్ లో మొదలు పెట్టారు. అది కూడా ఓ యాక్షన్ ఎపిసోడ్ తో రామ్ శివం సినిమా షూటింగ్ ని మొదలు పెట్టాడు. ప్రసతుతం హైదరబాద్ శివార్లలో పీటర్ హెయిన్స్ నేతృత్వంలో రామ్ పై ఓ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నారు.

ఈ మొదటి షెడ్యూల్ ఫిబ్రవరి 25 వరకూ హైదరాబాద్ లోనే జరగనుంది. నటులు ‘తాగుబోతు’ రమేశ్, ‘గుండె జారి గల్లంతయ్యిందే’ ఫేమ్ మధునందన్, శ్రీనివాసరెడ్డి, అభిమన్యు సింగ్ తదితరులు ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. స్రవింతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవికిషోర్ నిర్మించనున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్నాడు. ప్రసతుతం ఈ సినిమాలో రామ్ జోడీ కోసం అన్వేషిస్తున్నారు. మరోవైపు రాశి ఖన్నాని కూడా హీరోయిన్ గా పరిశీలిస్తున్నారు. రామ్ చేస్తున్న పండగ చేస్కో సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది, త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసి సమ్మర్ లో సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

.జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : actor ram  tollywood news  busy movies shedule  

Other Articles