Rajinikanth supreme court my hoon rajinikanth movie controversy director faisal saif bollywood

rajinikanth news, rajinikanth controversy, rajinikanth latest news, rajinikanth movies, rajinikanth movie controversies, rajinikanth updates, my hoon rajinikanth movie, my hoon rajinikanth movie controversy, director faisal saif, producer suraj, actor aditya menon

rajinikanth supreme court my hoon rajinikanth movie controversy director faisal saif bollywood : My hoon Rajinikanth movie producer is ready to file petition in supreme court against rajinikanth.

సుప్రీంకోర్టులో రజనీపై పిటిషన్.. వెనక్కు తగ్గనంటున్న నిర్మాత..

Posted: 02/06/2015 09:46 AM IST
Rajinikanth supreme court my hoon rajinikanth movie controversy director faisal saif bollywood

సూపర్ స్టార్ రజనీకాంత్ కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి ఓ బాలీవుడ్ నిర్మాత సిద్ధంగా వున్నాడని సమాచారం! ఇటీవలే ఓ మూవీకి సంబంధించి రజనీకి, సదరు చిత్రనిర్మాత మధ్య కొన్ని విభేదాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రజనీకి అతనిపై హైకోర్టులో పిటిషన్ వేస్తే.. దాన్ని సవాల్ చేస్తూ ఆ నిర్మాత ఏకంగా సుప్రీంకోర్టు మెట్లు ఎక్కడానికి సిద్ధపడుతున్నాడు. ఇంతకీ ఆ నిర్మాత ఎవరనుకుంటున్నారా..? అయితే మేటర్’లోకి వెళ్లాల్సిందే!

హిందీలో పైసల్ సైఫ్ అనే దర్శకుడు ‘మై హూన్ రజనీకాంత్’ టైటిల్’తో ఓ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే! తెలుగు, తమిళంలో ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్’గా పలుచిత్రాలు చేసిన ఆదిత్యామీనన్ ఇందులో హీరోగా నటిస్తుండగా.. సూరజ్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. అయితే.. ఈ మూవీ టైటిల్’కు సంబంధించి రజనీకి, ఆ చిత్రబృందం మధ్య వివాదాలు ఏర్పడ్డాయి. పర్మిషన్ లేకుండానే తన పేరును వాళ్లు మూవీకి పెట్టుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రజనీ.. పిటిషన్ వేశారు. ఆ సినిమాను విడుదల చేయకూడదంటూ చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించేవిధంగా ఈ మూవీ టైటిల్’తోపాటు సన్నివేశాలు - ప్రచారం చూస్తుంటే సందేహం కలుగుతోందంటూ ఆయన ఆ పిటిషన్’లో పేర్కొన్నారు. దీంతో ఈ చిత్రం విడుదలపై నిషేధం విధించాలని ఆయన కోరారు.

రజనీ వేసిన పిటిషన్’ను హైకోర్టు విచారించిన అనంతరం ఆయనకు అనుకూలంగానే తీర్పునిచ్చింది. దీంతో ఈ చిత్రం తమిళంలో విడుదల కాదన్నమాట! అయితే.. కోర్టు తీర్పుతో అసంతృప్తి చెందిన ఆ మూవీ నిర్మాత.. సుప్రీంకోర్టుకు అప్పీల్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు ఆ చిత్ర దర్శకుడు పైసల్ సైఫ్ వెల్లడించారు. ఈ విషయంపై మాట్లాడిన ఆయన.. కథకు తగినట్లుగానే టైటిల్’ను నిర్ణయించామని, ఇందులో రజనీని కించపరిచేవిధంగా ఏమీ లేదంటూ తెలిపాడు. చిత్ర కథ మొత్తం హీరో చుట్టూనే తిరుగుతుందని తెలిపిన ఆయన.. ఒక దర్శకుడిగా రజనీని అవమానించాలని తాను భావించలేదని స్పష్టం చేశాడు. నిజానికి మొదట ఆ చిత్రం టైటిల్ మార్చాలని భావించినా.. నిర్మాత ఒత్తిడి మేరకు అదే టైటిల్’ను ఖరారు చేయాలని నిర్ణయానికి వచ్చాం. అందుకే.. రజనీపై పోరాటానికి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నారని పేర్కొన్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles