Anushka rudhramadevi audio songs leaked

Anushka Rudhramadevi Audio Songs Leaked, Rudhramadevi Songs Leaked, Anushka Rudhramadevi Audio Release Date, Rudhramadevi Movie Audio Release Date, Anushka Rudhramadevi Movie Audio Release Date, Anushka Rudhramadevi Audio Release Date, Rudhramadevi Audio Release Date, Anushka Rudhramadevi Movie Audio, Gunasekhar Rudhramadevi Movie Audio, Rudhramadevi Movie Audio news, Rudhramadevi Movie Audio rights sold, Rudhramadevi Movie Audio on Lahari music, Rudhramadevi Movie Audio sold out, Rudhramadevi Movie Audio

Anushka Rudhramadevi Audio Songs Leaked: Director Gunashekhar Upcoming movie Rudhramadevi. anushka, rana, allu arjun in lead roles, ilayaraja music. Movie Audio Released on feb last week.

బాహుబలి వార్... రుద్రమదేవి పాటలు

Posted: 02/04/2015 12:56 PM IST
Anushka rudhramadevi audio songs leaked

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పైరసీ బాగా ఎక్కువైపోయిన విషయం అందరికి తెలిసిందే. మొన్నటి వరకు సినిమా విడుదలైన తర్వాత పైరసీ గా వస్తుంటే... గతకొద్ది కాలం నుంచి సినిమా విడుదలకు ముందే పైరసీ వచ్చేస్తోంది. అయితే తాజాగా మాత్రం సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే పైరసీ వచ్చేస్తోంది. సినిమా షూటింగ్ పూర్తవ్వకుండానే, ఆ సినిమాకు సంబంధించిన సన్నీవేశాలు లీక్ అవుతున్నాయి. దీని ద్వారా చిత్ర దర్శక,నిర్మాతలు కంగారుపడుతున్నారు.

ఇటీవలే రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘బాహుబలి’ చిత్రానికి సంబంధించిన 12 నిమిషాల వార్ సీన్ వీడియో విడుదలైన విషయం తెలిసిందే. దీంతో చిత్ర యూనిట్ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకోవడంతో... ఈ వీడియోను ఎక్కువగా పబ్లిసిటీ కాకుండా అటు చిత్ర యూనిట్, ఇటు సైబర్ పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ లీకేజ్ కు సంబంధించిన నేరస్థులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

‘బాహుబలి’కి పోటీగా తెరకెక్కుతున్న మరో తెలుగు భారీ బడ్జెట్ చిత్రం ‘రుద్రమదేవి’. గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క, రానా, అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నాడు. ఈనెల చివర్లో ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఘనంగా చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇందుకు ముందుగానే ఈ చిత్ర పాటలు లీకయ్యాయంటూ వార్తలొస్తున్నాయి.

దీంతో ‘రుద్రమదేవి’ చిత్ర యూనిట్ తెగ కంగారుపడిపోతుంది. ఎంతో కష్టపడి చేస్తున్న సినిమాలను లీక్ చేయడం ఏంటంటూ బాధపడుతున్నారు. అయితే రుద్రమదేవికి సంబంధించిన ఎలాంటి సన్నీవేశాలు, పాటలు లీక్ కాకుండా చిత్ర యూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుంది. మరింత జాగ్రత్తలను పెంచేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anushka  Rudhramadevi  Audio  Songs  Leaked  Gunasekhar  tollywood  

Other Articles