Akkineni akhil latest movie updates vv vinayak nagarjuna hero nithin annapurna studios

akkineni akhil movie, akhil news, akhil movie news, vv vinayak news, akkineni nagarjuna news, nagarjuna latest news, amyra dastur news, amyra dastur hot photos, akkineni akhil amyra dastur movie, vv vinayak movie updates, amyra dastur movie updates, akkineni akhil movie updates

akkineni akhil latest movie updates vv vinayak nagarjuna hero nithin annapurna studios : Akkineni akhil movie will go on floors from feb 10. The movie unit is planning to release this movie on dussehra festival occasion.

‘‘ఆఫ్టర్ సిక్స్ మంత్స్’’ అంటున్న సిసింద్రీ!

Posted: 02/03/2015 04:09 PM IST
Akkineni akhil latest movie updates vv vinayak nagarjuna hero nithin annapurna studios

అక్కినేని కుటుంబం నుంచి వస్తున్న మరో వారసుడు అఖిల్ ఇంకా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వలేదు కానీ... అతని చిత్రానికి సంబంధించి రోజుకో వార్త హల్ చల్ చేస్తోంది. ఇటీవలే ముహూర్తం జరుపుకున్న ఈ సూపర్ స్టైలిష్ హీరో చిత్రం.. ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. నిజానికి ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే జరగాల్సి వుండేది కానీ.. ఫిబ్రవరి 10వ తేదీ వరకు పోస్ట్ పోన్ చేశారు. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం జరగడం వల్లే ఈ మూవీ షూటింగ్’ని అలా వాయిదా వేయడం జరిగింది. దీంతో ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందోనని చర్చలు కొనసాగుతున్నాయి.

తన కొడుకును టాలీవుడ్’లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలన్న ఆలోచనతో ఎన్నో జాగ్రత్తలు పాటించిన అనంతరం ఓ మంచి కథతోపాటు వివి వినాయక్ లాంటి ఎనర్జిటిక్ డైరెక్టర్’ని ఎంచుకున్నారు. అంతేకాదు.. నిఖిల్ నటనలో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నాడు. దాదాపు ఏడాదికిపైగా అన్ని ఏర్పాటు చేసుకున్న అనంతరం నిఖిల్ మూవీ గురించి నాగార్జున అధికారిక ప్రకటనను వెలువరించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్’ పనుల్లో వున్న ఈ మూవీ ఫిబ్రవరి 10వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోవడం ఖాయమని యూనిట్ వర్గాలు తెలుపుతున్నాయి. అలాగే.. షూటింగ్ శరవేగంగా జరుపుకుని దసరాకల్లా చిత్రాన్ని విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. దసరా పండుగ అంటే.. ‘‘ఆఫ్టర్ సిక్స్ మంత్స్’’ వరకు నిఖిల్ మూవీ విడుదల కాదన్నమాట!

మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమైరా దస్తుర్ హీరోయిన్’గా నటిస్తోంది. వెలిగొండ శ్రీనివాస్ ఈ మూవీకి కథను అందిస్తుండగా.. కోనవెంకట్, గోపి మోహన్ డైలాగులు సమకూరుస్తున్నారు. ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్’పై హీరో నితిన్, నాగార్జున సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్’ని ఎట్టి పరిస్థితుల్లోని త్వరగా కంప్లీట్ చేసి, ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా విడుదల చేయాలని పక్కా ప్లాన్’లో వున్నారని సమాచారం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles