Hansika busy in sword fighting

Hansika busy in sword fighting, Hansika sword fighting, Hansika learning sword fighting, Hansika sword fighting news, Hansika sword fighting for puli, Hansika latest news, Hansika puli news, Hansika puli movie news, Hansika movie updates, Hansika movie stills, Hansika hot stills, Hansika

Hansika busy in sword fighting: Tamil heroine Hansika latest movie Puli. Vijay, Shruti haasan, hansika in lead roles. Sridevi kapoor act in a special role.

పులి పాపకు చిన్న చిన్న గాయాలయ్యాయట

Posted: 01/30/2015 10:15 AM IST
Hansika busy in sword fighting

‘దేశముదురు’ బొద్దుగుమ్మ హన్సికకు టాలీవుడ్ లో అవకాశాలు అంతంత మాత్రంగానే వున్నప్పటికీ... కోలీవుడ్ లో మాత్రం వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. ఈ మధ్య హన్సిక నటిస్తున్న సినిమాలన్ని విజయం సాధిస్తుండటంతో... తమిళంలో వరుస ఆఫర్లు వచ్చిపడుతున్నాయి.

తమిళంలో పెద్ద హీరోల పక్కన నటించే అవకాశాన్ని దక్కించుకుంటోంది. ప్రస్తుతం ఈ అమ్మడు తమిళంలో విజయ్ సరసన నటిస్తోంది. తమిళంలో విజయ్ సరసన హన్సిక నటిస్తున్న తాజా చిత్రం ‘పులి’. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

అయితే ఈ చిత్రంలో హన్సిక కత్తి తిప్పే సన్నీవేశాలలో నటించాల్సి వుంది. అందుకోసం హన్సిక కత్తి శిక్షణ తీసుకుంటోంది. హంకాంగ్ నుండి ఖడ్గ విద్యలో ప్రావీణ్యం పొందిన వారి నుంచి హన్సిక శిక్షణ తీసుకుంటోంది.

శిక్షణలో మొదటి భాగం పూర్తయ్యేసరికి హన్సికకు చిన్న చిన్న గాయాలయ్యాయని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయితే శిక్షణ మొత్తం పూర్తయిన తర్వాతనే హన్సికపై యాక్షన్ సన్నీవేశాలను తెరకెక్కించనున్నారు. శింబుదేవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి శ్రీదేవి ఓ రాజమాత పాత్రలో నటిస్తోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles