Kajal agarwal dhanush maari movie birds fear

kajal agarwal news, kajal agarwal maari movie, hero dhanush news, hero dhanush maari movie, maari tamil movie news, maari movie photos, kajal agarwal maari movie, kajal agarwal dhanush movie

kajal agarwal dhanush maari movie birds fear : the gorgeous beauty kajal agarwal is telling that now she is free from the fear of birds

పావురాల్లాగే కాజల్ భయం తుర్రుమని ఎగిరిపోయిందట!

Posted: 01/28/2015 04:57 PM IST
Kajal agarwal dhanush maari movie birds fear

దక్షిణాది ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్’గా కొనసాగుతున్న కాజల్ అగర్వాల్’కి సంబంధించి ఎవరికీ తెలియని ఓ రహస్యం ఇన్నాళ్లకు బయటపడింది. ఇండస్ట్రీలో తిరుగులేకుండా దూసుకుపోతున్న ఈ అమ్మడు ఓ విషయంలో మాత్రం చాలా భయపడేదట! ఎప్పుడో చిన్నప్పటినుంచి ఆ భయాన్ని తన మనసులోనే దాచుకున్న ఈ పంజాబీ భామ.. ఇప్పుడు రివీల్ చేసింది. అసలు ఆమె ఏ విషయంలో భయపడేదని అనుకుంటున్నారా..? అయితే మేటర్’లోకి వెళ్లాల్సిందే!

చిన్నప్పటి నుంచి కాజల్’కి పక్షులంటే ఎంతో భయమట! అందుకే.. వాటి దరిదాపులకే వెళ్లేది కాదట! ముఖ్యంగా పావురాలంటే దడుచుకుపోయేదట! అవి కనిపించినప్పుడల్లా ఆమడదూరంలో వుండి వాటిని వీక్షించేందట! అలాంటి కాజల్’కి ఇప్పుడు ఆ భయం పూర్తిగా పోయిందని సంతోషంగా వ్యక్తం చేస్తోంది. అది కూడా ఓ తమిళ హీరో చేసిన సహాయం మేరకు తన మనసులోని ఈ పావురాల భయాన్ని పోగొట్టుకున్నట్లు వెల్లడించింది. ఆ హీరో మరెవ్వరో కాదు.. హీరో ధనుష్!

ప్రస్తుతం కాజల్ తమిళంలో ధనుష్ సరసన ‘మారీ’ అనే చిత్రంలో నటిస్తోంది. ఆ సినిమాలో ఈ అమ్మడు పక్షులతో కలిసి నటించాల్సి వుంది. మొదట్లో ఈ సీన్ గురించి ఆమెను వివరించగా.. భయంతో చేయనంటూ మొండికేసిందట! పక్షులంటే తనకు భయమని, ముఖ్యంగా పావురాలంటే చచ్చేంత భయమని, తాను ఆ సీన్’లో నటించనంటూ మారాం చేసిందట! అయితే యూనిట్ సభ్యులు ఆ పావురాలను ఈమెకు మెల్లగా అలవాటు చేయడంతో వాటితో చనువు ఏర్పడిందని స్వయంగా కాజల్ వివరించింది.

ఈ విషయంపై కాజల్ మాట్లాడుతూ.. ‘‘మారీ’ సినిమాలో నేను పక్షులతో కలిసి నటించాల్సి వుంది. ఆ విషయం తెలియగానే మొదట్లో తెగ భయపడ్డాను. అయితే తర్వాత యూనిట్ సభ్యులు ఆ పక్షులను నాకు మెల్లగా అలవాటు చేయడంతో వాటితో స్నేహం ఏర్పడింది. దాంతో ఇప్పుడు నాకు పక్షులంటే వున్న భయం పూర్తిగా పోయింది’’ అంటూ మురిసిపోతూ సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kajal agarwal maari movie  hero dhanush news  tollywood gossips  

Other Articles