Daggubati rana shahrukh khan bollywood movie offer

rana daggubati news, shahrukh khan news, daggubati rana bollywood news, shahrukh khan latest news, shahrukh khan rohit shetty movie, shahrukh khan press meet, shahrukh khan rana news, rana shahrukh khan movie

daggubati rana shahrukh khan bollywood movie offer : daggubati rana finally got a huge offer to act with shahrukh khan in his next movie which will go on to the floor from march.

రానాకి రంగులు అద్దనున్న బాలీవుడ్ ‘బాద్షా’

Posted: 01/23/2015 04:38 PM IST
Daggubati rana shahrukh khan bollywood movie offer

టాలీవుడ్ మాచో మ్యాన్’గా పేరొందిన దగ్గుబాటి రానా.. సెలెక్టెడ్ మూవీలను మాత్రమే చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ.. ఇంతవరకు సోలోగా ఒక్క హిట్ కూడా దక్కలేదు. అయినా.. తన నటనాప్రతిభతో క్రియేటివ్ నటుడిగా పేరొందిన రానా.. ఇటు తెలుగుతోబాటు హిందీలోనూ తెరకెక్కే కమర్షియల్ మూవీల్లో కీలకపాత్ర ఆఫర్లను దక్కించుకుంటున్నాడు. ఆరడుగుల ఎత్తుతోపాటు కండలు తిరిగిన బాడీని కలిగి వుండటంతో ఈ హీరోకి ప్రత్యేక పాత్రల్లో నటించే అవకాశాలను దర్శకనిర్మాతలు పిలిచిమరీ ఇస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్’లో కొన్ని మూవీల్లో కొన్ని కీలకపాత్రల్లో నటించిన ఈ నటుడి.. ఈసారి బాలీవుడ్ బాద్షా షారుఖ్ నటించబోయే తదుపరి చిత్రంలో భారీ ఆఫర్’ను దక్కించుకున్నాడు.

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించబోయే అప్’కమింగ్ మూవీలో రానా దగ్గుబాటికి ఓ కీలకపాత్రలో నటించే అవకాశం దక్కినట్లు సమాచారం! ప్రస్తుతం ‘ఫ్యాన్’ చిత్రం షూటింగ్’లో బిజీగా వున్న షారుఖ్.. ఆ తర్వాత రోహిత్ శెట్టి దర్శకత్వంలో నటించనున్నట్లు తెలిపాడు. మార్చి నుంచి షూటింగ్ ప్రారంభమయ్యే ఈ చిత్రంలోనే రానాకు ఆఫర్ లభించినట్లు చెబుతున్నారు. అయితే.. ఈ వార్త ఇంకా అధికారికంగా వెలువడాల్సి వుంది. ఒకవేళ రానాకు ఈ ఆఫర్ దక్కితే మాత్రం.. బాలీవుడ్’లో ఈ హీరోకి క్రేజ్ మరింతగా పెరిగిపోతుంది. ఏది ఏమైనా.. ఇటు తెలుగులో సరిగ్గా గుర్తింపు లభించకపోయినప్పటికీ.. బాలీవుడ్’లో తన సత్తా చాటుతున్నాడు రానా!

ఇదిలావుండగా.. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ‘బేబీ’ చిత్రంలో ఓ కీలకపాత్ర పోసించిన సంగతి విదితమే! శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ.. మంచి రివ్యూస్ సాధించింది. ఇందులో అక్షయ్ నటనకు ఎంత మంచి గుర్తింపు దక్కిందో.. అంతే రానాకు లభించింది. ఇందులో రానా యాక్టింగ్ అద్భుతంగా వుందని విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. ఇక షారుఖ్ మూవీలో నటిస్తే.. ఆ క్రేజ్ ఇంకా పెరిగిపోతుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : daggubati rana bollywood  shahrukh khan latest news  rohit shetty news  

Other Articles