Ram gopal varma special bumper offer different story manchu manoj movie news

ram gopal varma, manchu manoj, ram gopal varma latest news, manchu manoj movies, varma manoj movie updates, varma manchu manoj movie news, manchu family varma news

ram gopal varma special bumper offer different story manchu manoj movie news : ram gopal varma preparing a special story for manchu manoj character.

మనోజ్’కి వర్మ బంపరాఫర్.. వర్కౌట్ అవుద్దా?

Posted: 01/23/2015 11:34 AM IST
Ram gopal varma special bumper offer different story manchu manoj movie news

మంచు మనోజ్’తో కలిసి వర్మ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే! దీంతో వీరి ప్రాజెక్ట్ ఎలా వుండబోతుందన్న ఆసక్తి నెలకొంది. డిఫరెంట్ సబ్జెక్ట్స్’తో విభిన్న పాత్రల్లో నటిస్తూ కొత్త ప్రయోగాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్’ఫుల్’గా దూసుకెళ్తున్న మనోజ్’తో వర్మ ఎలాంటి పాత్ర చేయించనున్నాడనే ప్రచారాలు సాగుతున్నాయి. ఎప్పుడూ వివాదాస్పదమైన కాన్సెప్ట్స్’తోనే తెరముందుకొచ్చే వర్మ.. ఈ యువనటుడిని ఏ విధంగా తెరపై చూపిస్తాడు..? ఎలాంటి కథాంశాన్ని ఎంచుకోబోతున్నాడు.? అని సర్వత్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ విధంగా వెలువడుతున్న సందేహాలకు అనుగుణంగానే వర్మ ఓ ‘స్పెషల్ స్టోరీ’ని మనోజ్ కోసం రెడీ చేస్తున్నాడని సమాచారం! మనోజ్’కు తగ్గట్టుగానే ఓ కొత్త పాత్రతోబాటు తనదైన స్టైల్’లో డిఫరెంట్ స్టోరీని రాస్తున్నాడని వార్తలొస్తున్నాయి. గతంలోకంటే భిన్నంగా మనోజ్’ని చూపిస్తూ.. అతని ఇమేజ్ ఇండస్ట్రీలో మరింతగా పెరిగేలా ప్రయత్నాలు చేస్తున్నాడట వర్మ! అందుకే.. ఇతని కోసం ప్రత్యేకంగా కొన్నాళ్లు వీక్షించి మరీ స్టోరీని రాస్తున్నాడని.. ఇప్పటికే స్ర్కిప్ట్ వర్క్ చివరి దశకు చేరుకుందని ఇండస్ట్రీవర్గాల సమాచారం! అంతేకాదు.. వర్మ డైరెక్షన్ యాంగిల్ కూడా సరికొత్తగా వుంటుందని అంటున్నారు.

ఇదిలావుండగా.. వర్మతో కలిసి ఒక్క సినిమాలోనైనా నటించాలనుందనే కోరికను తన కుటుంబసభ్యులతో మనోజ్ వెల్లడించాడట! అందుకే.. వీరిద్దరి కాంబోలో చిత్రాన్ని తెరకెక్కించాలనే మనోజ్ ఫ్యామిలీ ప్రయత్నాలు చేసిన మేరకు అందుకు వర్మ అంగీకరించాడట! ‘అనుక్షణం’ చిత్రంతో విష్ణుకి విజయాన్ని వర్మ అందించడంతో మనోజ్’కి మరో డిఫరెంట్ సబ్జెక్ట్’తో చిత్రాన్ని తెరకెక్కించాలంటూ మోహన్ బాబు అతడ్ని సజ్జెస్ట్ చేశాడట! అందుకు అంగీకరించిన వర్మ.. కొన్నిరోజుల కిందటే మనోజ్’తో మంతనాలు జరిపి.. అతనికి తగ్గట్టుగానే క్యారెక్టర్’ని క్రియేటర్ చేసి డిఫరెంట్ స్టోరీతో తెరముందుకు తీసుకొస్తున్నట్లు సమాచారం!

ఇక వర్మతో మంచు ఫ్యామిలీకి వున్న సంబంధాల గురించి మాట్లాడుకుంటే.. ఓ ఫంక్షన్’లో సందర్భంగా మోహన్’బాబు తనకు వర్మ చిత్రాలు నచ్చుతాయని బహిరంగంగా పేర్కొన్నారు. అంతేకాదు.. ఆయన మూవీలు ఎంతో ఆకర్షణీయంగా వుంటాయని తెలిపారు కూడా! ఇక అప్పటినుంచి వ్యక్తిగతంగా సన్నిహితులైన వీరు.. ఇండస్ట్రీలో మూవీలపరంగా అదే బంధాన్ని కొనసాగిస్తున్నారు. మంచు ఫ్యామిలీ ఇండస్ట్రీలో సరిగ్గా హిట్ లభించని తరుణంలో వర్మ వారితో మమేకమయ్యారు. ముందుగా విష్ణు, లక్ష్మీమంచులను ‘డిపార్ట్ మెంట్’ చిత్రాన్ని తీశాడు కానీ.. అది ఫెయిల్ అయ్యింది. అయితే ఆ తర్వాత అదే ఫ్యామిలీతో కలిసి తీసిన ‘రౌడీ’ చిత్రం బిగ్గెస్ట్ హిట్’గా నిలిచింది. ఇక తాజాగా విష్ణుతో తీసిన ‘అనుక్షణం’ కూడా హిట్ టాక్’తో కలెక్షన్లను బాగానే రాబట్టింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ram gopal varma  manchu manoj  tollywood news  

Other Articles