Kalyan ram pataas movie news director anil ravupudi special interview

kalyan ram latest news, kalyan ram pataas movie, pataas movie news, pataas movie review, pataas movie telugu review, pataas movie latest news, pataas movie collections, pataas movie, pataas movie stills, kalyan ram interview

kalyan ram pataas movie news director anil ravupudi special interview : director anil ravupudi speaks about his latest directorial movie pataas in which kalyan ram playing leading role.

‘పటాస్’ మూవీ తుస్సుమనిపించిన కళ్యాణ్...!

Posted: 01/22/2015 01:41 PM IST
Kalyan ram pataas movie news director anil ravupudi special interview

కళ్యాణ్ రామ్ తాజాగా నటించిన ‘పటాస్’ చిత్రం ఈనెల 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే! ఎన్టీఆర్ ప్రొడక్షన్స్’పై తానే స్వయంగా నిర్మించిన తన చిత్రమే తుస్సుమనేలా కళ్యాణ్ బాంబు పేల్చాడు. అతడు ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేశాడంటూ ఈ మూవీ దర్శకుడు అనిల్ తాజాగా బాంబు పేల్చాడు. అదేంటి.. విడుదల అవుతున్న ఈ చిత్రాన్ని కళ్యాణ్ ఎలా, ఎందుకు రిజెక్ట్ చేశాడు..? అన్నదేగా మీ సందేహం..! ఆ పూర్తి వివరాలు తెలియాలంటే మేటర్’లోకి వెళ్లాల్సిందే!

ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు అనిల్.. తన తాజా ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన వ్యవహారాలను వెల్లడించాడు. ‘ఈ చిత్రాన్ని కళ్యాణ్ రిజెక్ట్ చేశాడు’ అంటూ ఒక్కసారిగా షాకిచ్చాడు. అయితే.. అతను రిజెక్ట్ చేసింది ఇప్పుడు కాదులెండి.. ఇంకా తెరకెక్కించకముందే! ఆ వ్యవహారం గురించి అనిల్ చెబుతూ.. ‘‘కళ్యాణ్ రాం తన ‘ఓం 3డీ’ మూవీని తెరకెక్కిస్తున్న సమయంలో నేను ‘పటాస్’ మూవీ కథను వినిపించినప్పుడు.. ఆ పాత్రకు తాను సరిపోనంటూ రిజెక్ట్ చేశాడు. ఆ పాత్రకు ఎన్టీఆర్ అయితే సరిపోతాడని, అందుకు ఆ చిత్రాన్ని నిర్మించడానికి తాను సిద్ధంగానే వున్నానని రాం అన్నారు’’ అని తెలిపాడు. కానీ.. తను మాత్రం కేవలం కళ్యాణ్ రాంని దృష్టిలో పెట్టుకుని కథను రాశానని చెబుతున్న దర్శకుడు అనిల్.. చివరికి ఎలాగోలా ఆయన్ను కన్విన్స్ చేసి తానే నటించేలా ఒప్పించానని తెలిపాడు.

యాక్షన్-కామెడీ ఎంటర్టైనర్’గా రూపొందిన ఈ చిత్రంలో పంచ్ డైలాగులు బాగానే వున్నాయని విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ చిత్రానికి జూనియర్ ఎన్టీఆర్ అందించిన వాయిస్ మరింత క్రేజ్’ని తెచ్చిపెడుతుందని భావిస్తున్నారు. ఇక కళ్యాణ్ కూడా ఈ చిత్రంపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు. గతంలోకంటే పూర్తి భిన్నమైన పాత్రలో నటించిన కళ్యాణ్’కు ఈ చిత్రం ఏమేరకు సక్సెస్’ను అందిస్తుందో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kalyan ram latest news  pataas movie updates  director anil ravupudi news  

Other Articles