Music maestro ilayaraja shamitabh audio function kamal hassan rajinikanth

kamal hassan news, rajinikanth news, kamal hassan rajinikanth news, kamal hassan rajinikanth difference, ilayaraja news, music maestro ilayaraja comments, sridevi latest news, shamitabh audio function, amitabh bachchan news, dhanush news, akshara hassan news

music maestro ilayaraja shamitabh audio function kamal hassan rajinikanth : the music composer maestro ilayaraja speaks about kamal hassan and rajinikanth characters in shamitabh audio funtion where they all take part together.

రజనీకాంత్ దర్శకత్వంలో.. కమల నటన..

Posted: 01/21/2015 12:06 PM IST
Music maestro ilayaraja shamitabh audio function kamal hassan rajinikanth

సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఇద్దరూ ఇద్దరే! కమల్ తన అద్భుతమైన నటనాప్రతిభతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తే.. రజనీ తన స్టైలిష్ మేనరిజంతో అందరినీ ఆకట్టుకుంటారు. అంతేకాదు.. వీరిద్దరూ 60వ ఏటలో అడుగు పెట్టినప్పటికీ ఇంకా లీడింగ్ క్యారెక్టర్’లోనే నటిస్తూ, అభిమానులను సంతోషపరుస్తున్నారు. నిజానికి ఇండస్ట్రీలో వున్న హీరోలందరూ 50 ఏళ్లకే రిటైర్ అవుతుండగా.. ఈ ఇద్దరు బిగ్ స్టార్స్ మాత్రం అందరికీ భిన్నంగా ఆరుపదుల వయస్సు దాటినప్పటికీ హీరోలుగానే కొనసాగుతున్నారు. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు.. వీరికి ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ వుందో!

ఇదిలావుండగా.. సంగీత దర్శకుడు మాయిస్ట్రో ఇళయరాజా మాత్రం వీరిద్దరికీ సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను బహిర్గతం చేశారు. ‘‘కమల్ హాసన్ అదరినీ మంత్రముగ్ధుల్ని చేసే గొప్ప నటుడు. కెమెరా ముందుకు వస్తే చాలు.. ఆయన తన పాత్రలో లీనమైపోతాడు. అంతేకాదు.. అతనొక గొప్ప సింగర్ కూడా’’ అంటూ కమల్ గురించి తెలిపారు. ఇక రజనీ గురించి చెబుతూ.. ‘‘రజనీలో ఓ నటుడుకంటే అద్భతమైన డైరెక్టర్ దాగివున్నాడు. ఆయన స్ర్కీన్’ప్లేను ఎంతో ఉత్తమంగా రాస్తారు. నేను తనను చాలాసార్లు చెప్పాను కూడా! మీ సినిమాకు మీరే స్ర్కీన్’ప్లే రాసుకోవచ్చు కదా అని! కానీ ఆయన చిరునవ్వుతో అదొక డిఫరెంట్ వర్క్ అంటూ చెప్పేవారు’’ అన్నారాయన!

‘షమితాబ్’ ఆడియో విడుదల సందర్భంగా హాజరైన ఇళయరాజా.. ఈ విధంగా ఇద్దరిలో దాగివున్న ప్రతిభల గురించి విశదీకరించారు. ధనుష్, అమితాబ్ బచ్చన్, అక్షర హాసన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీకి ఇళయరాజా సంగీతం అందించిన విషయం తెలిసిందే! ఇంకో విషయం ఏమిటంటే.. ఈ ఆడియో వేడుకలో కమల్, రజనీలతోబాటు శ్రీదేవి కూడా తళుక్కుమన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kamal hassan  rajinikanth  amitabh bachchan  ilayaraja  

Other Articles