Trisha krishnan varun manian engagement twist clarification on gift

trisha varun engagement, trisha krishnan marriage news, trisha marriage news, trisha varun manian photos, trisha varun private photos, trisha hot photo shoot, trisha krishnan hot photo shoot, trisha krishnan photos, trisha marriage news

trisha krishnan varun manian engagement twist clarification on gift : finally varun manian given clarification on gift that he is not giving any car to trisha. He is making a small programme where both they went to feed animals after their engagement.

త్రిష ఎంగేజ్’మెంట్’లో వరుడి ట్విస్ట్!

Posted: 01/20/2015 04:25 PM IST
Trisha krishnan varun manian engagement twist clarification on gift

చెన్నై సుందరి త్రిష ఈనెల 23వ తేదీన పారిశ్రామికవేత్త వరుణ్ మనియన్’తో నిశ్చితార్థం చేసుకోబోతున్న విషయం తెలిసిందే! ఈ సందర్భంగా అన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేసుకున్నారు. అయితే.. ఇంతలోనే వరుడు ఓ సరికొత్త ట్విస్టుతో తెరముందుకు వచ్చాడు. ఇన్నాళ్లవరకు అందరినీ ఊరిస్తూ వస్తున్న వరుణ్.. త్రిషతోబాటు ప్రేక్షకులకు షాక్ తగిలేలా ఓ స్టేట్’మెంట్ ఇచ్చేశాడు. వారిద్దరి మధ్య వచ్చిన కొన్ని రూమర్లను కొట్టిపారేశాడు. ఇంతకు అతడిచ్చిన ఆ ట్విస్ట్ ఏమిటీ అని అనుకుంటున్నారా..?

నిశ్చితార్థం సందర్భంగా వరుణ్ తన కాబోయే భార్య త్రిషకు ఏడుకోట్ల ఖరీదైన రోల్స్ రాయిస్ కారును కానుకగా ఇవ్వనున్నట్లు మీడియాలో కథనాలు వచ్చిన విషయం విదితమే! అయితే తాను అలాంటి గిఫ్ట్ ఏమీ త్రిషకు ప్రెజెంట్ చేయడం లేదనీ, అదొక ‘సిల్లీ రూమర్’ మాత్రమేనంటూ కొట్టిపారేశాడు. ఈ రూమర్లు వచ్చిన నేపథ్యంలో త్రిష కూడా వరుణ్ తనకు కార్ గిఫ్టుగా ఇస్తాడేమోనన్న ఆశలో వుండేది. కానీ ఇప్పుడు వరుణ్ ఇచ్చిన స్టేట్’మెంట్’తో ఆమె ఆశలు అడియాశలు అయి వుంటాయని అందరూ అనుకుంటున్నారు. అయితే.. వరుణ్ ఇక్కడ తెలివిగా త్రిషను ఇంప్రెస్ చేసే ఓ పథకాన్ని ముందుగానే రెడీ చేసుకున్నాడట!

అదేమిటంటే.. నిశ్చితార్థం అయిన తర్వాత ఇద్దరూ కలిసి వేలకొద్దీ జంతువులకు ఆశ్రయం కల్పించి.. వాటికి మెడికల్ ట్రీట్మెంట్ కూడా ఇప్పించి ఫీడ్ చేయాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. త్రిషకు ఎంతో ఇష్టమైన ఈ కార్యక్రమాన్ని నిశ్చితార్థం గిఫ్టుగా ఇస్తున్నట్లు స్పష్టం చేశాడు. త్రిష కూడా రోల్స్ రాయిస్ కారుకంటే దీనికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తుందని తెలిపాడు. అంటే.. ఏడుకోట్ల కారుకంటే తన మనసుకు నచ్చిన గిఫ్టుతోనే త్రిషను ఇంప్రెస్ చేయనున్నట్లు అతడు విశదీకరించాడు.
 
ఇదిలావుండగా.. జంతుకారుణ్య సంఘం ‘పెటా’లో త్రిష క్రీయాశీల సభ్యురాలిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే! లోగడ ఈ అమ్మడు ఓ బ్లూక్రాస్ ఈవెంట్’లో తనకు లైఫ్ పార్టనర్’గా జంతుప్రేమికుడే కావాలని ప్రకటించింది కూడా! ఇప్పుడు ఆ మాటలనే నిజం చేస్తూ వరుణ్ ఈ విధమైన నిర్ణయం తీసుకుని వుంటాడని అందరూ అనుకుంటున్నారు. ఏదేమైనా.. వరుణ్ మనియన్ చాలా తెలివైన వరుడేనంటూ చెప్పుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : trisha varun marriage news  varun manian gift  tollywood news  

Other Articles