Sunny leone got stucked in lift mumbai

sunny leone news, sunny leone hot photo shoo, sunny leone stuck in a lift, sunny leone photo gallery, sunny leone with husband, sunny husband daniel webber

sunny leone got stucked in lift mumbai : the hot sexy actress sunny leone got stuck in a lift in which event managers are also inside.

మేనేజర్లతో ‘లిఫ్ట్’లో ఇరుక్కుపోయిన సన్నీ..!

Posted: 01/18/2015 04:48 PM IST
Sunny leone got stucked in lift mumbai

పోర్న్ స్టార్ నుంచి బాలీవుడ్ సెక్సీ బ్యూటీ స్థాయికి చేరుకున్న సన్నీలియోన్’కు అనుకోకుండా ఓ పరాభావాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఓ ఈవెంట్’కి అటెండ్ అవడానికి బయలుదేరిన ఈ ముద్దుగుమ్మ.. తానెక్కిన లిఫ్ట్ లోనే కొంతమంది మేనేజర్లు కూడా ఎక్కారు. అయితే అది వాళ్ల అదృష్టమో, సన్నీ దురదృష్టమో తెలియదు కానీ.. కొద్దిసేపటివరకు ఆ లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయింది. కాసేపు తర్వాత లిఫ్ట్ మళ్లీ ఆన్ అయ్యింది. అప్పుడు బయటకు వచ్చిన సన్నీ నవ్వుతూ కనిపిస్తే.. మేనేజర్లకు మాత్రం ఫుల్లుగా చెమటలు పట్టేశాయట! అంతే! అసలు లోపలేం జరిగిందని అంతా సందేహాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టేశారు.

అసలు జరిగిన విషయం ఏమిటంటే.. ముంబైలో సన్నీ తన భర్త డేనియల్ వెబర్’తో కలిసి ఓ కవర్ పేజీని లాంచ్ చేయడానికి వెళ్లింది. ఆ ఈవెంట్ నిర్వహించిన బిల్డింగ్’లోనే ఈ అమ్మడు తన భర్తతో కలిసి లిఫ్ట్’లోకి వెళ్లింది. అదే సమయంలో ఆ ఈవెంట్’ను నిర్వహించిన మేనేజర్లు కూడా వారితోనే ‘లిఫ్ట్’లో వున్నారు. అందరూ ఇంకా పైకి వెళుతున్న సమయంలో ఆ లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయింది. అయితే.. సన్నీ ఎక్కడ బాధపడుతుందో, తమ మీద ఎక్కడ కోపగించుకుంటుందోనన్న భయంతో వెంటనే టెక్నీషియన్స్’ను సంప్రదించారు. లిఫ్ట్ నడిచే వరకు ఆ మేనేజర్లు హడావుడి చేసేశారు. తీరా లిఫ్ట్ నడిచిన తర్వాత సన్నీ సింపుల్’గానే బయటకు వెళ్లిపోయింది.

అంటే.. మేనేజర్ల మీదగానీ, యాజమాన్యం మీదగానీ, టెక్నీషియన్స్ మీదగానీ ఏమాత్రం కోపగించుకోకుండా వారందరికీ థ్యాంక్స్ చెప్పి మరీ వెళ్లిందట! దీంతో చెమటలతో ఉక్కిరిబిక్కిరి అయిపోయిన ఆ మేనేజర్లు.. చివరికి ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత అమ్మడు తన భర్తతో కలిసి ఆ కవర్ పేజీని లాంచ్ చేసింది. ఇదీ సంగతి! ఆ లిఫ్ట్’లో జరిగిన మొత్తం తతంగం ఇదే! మరి.. మీరేం అనుకున్నారు?

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sunny leone lift news  bollywood actresses  telugu news  

Other Articles